విషాదం: సినిమాల్లో మాదిరిగానే కలను నిజం చేస్తూ ఆత్మహత్య
చెన్నై: ఆత్మహత్య చేైసుకొన్నట్టు వచ్చిన కలను నిజం చేస్తూ ఓ విద్యార్థిని ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మాహుతి చేసుకొన్న సంఘటన చెన్నైలో చోటుచేసుకొంది.
చెన్నైలోని తండయారుపేట వినోద్ పాల్ నగర్ కు చెందిన వేలు ప్రైవేట్ సంస్తలో వాచ్ మెన్. అతని కుమార్తె దుర్గ ఇంటర్ చదువుతోంది.
ఆమెకు తరచూ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంటున్నట్టు కలలు వచ్చేవి.ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. అయితే ఈ విషయాన్ని తల్లిదండ్రులు అంత సీరియస్ గా పట్టించుకోలేదు.

ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు ఎవరూ లేనప్పుడు ఒంటిపై కిరోసిన్ పోసుకొని బాలిక ఆత్మాహుతికి పాల్పడింది.
కేకలు విని అక్కడకు చేరుకొన్న చుట్టుపక్కలవారు వెంటనే బాలికను కీల్పాక్కం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.ఆసుపత్రిలోనే చికిత్సపొందుతూ దుర్గ శనివారం మధ్యాహ్నం మృతి చెందింది.












Click it and Unblock the Notifications