లోకసభ ఎన్నికలు: శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం అంశంపై ఈసీ హెచ్చరిక
తిరువనంతపురం: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సున్నితమైన శబరిమల అయ్యప్ప స్వామి అంశాన్ని ఏ పార్టీ కూడా తమ ప్రచారానికి ఉపయోగించుకోవద్దని కేరళ ఎన్నికల సంఘం ఆదేశారు జారీ చేసింది. అయ్యప్ప స్వామి అంశాన్ని ఏ రాజకీయ పార్టీ తమ లబ్ధి కోసం వాడుకున్నా అది ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుందని హెచ్చరించారు.
ఈ మేరకు ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి తీకా రామ్ మీనా స్పష్టం చేశారు. శబరిమల ఆలయం, దేవుడి పేరిట మత భావనలను రేకెత్తించడం, సుప్రీం కోర్టు తీర్పును ఏవిధంగానైనా ప్రస్తావించడం, మతం పేరుతో ఓట్లు అడగడం వంటివి చేయవద్దని చెప్పారు.

కేరళకు సంబంధించి శబరిమల వివాదాస్పద అంశమని, ఈ విషయమై రాజకీయ పార్టీలు కచ్చితమైన గిరి గీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాగా, రెండు రోజుల క్రితం ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications