Kohli vs Gambhir video: బీసీసీఐ కొరడా- ఇద్దరికీ జాయింట్‌గా వాత
లక్నో: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా సోమవారం రాత్రి- లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగిన మ్యాచ్.. దుమారం రేపుతోంది. ఈ మ్యాచ్ ముగిసిన తరువాత ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఎల్‌ఎస్జీ మెంటార్ గౌతమ్ గంభీర్ గొడవ పడటం, పరస్పరం మాటల యుద్ధానికి దిగడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. వారిపై కొరడా ఝుళిపించింది.
లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నామమాత్రపు స్కోర్ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లల్లో తొమ్మిది వికెట్ల నష్టానికి 126 పరుగులు మాత్రమే చేసింది. ఈ స్కోర్‌ను కూడా ఛేదించలేకపోయింది లక్నో సూపర్ జెయింట్స్. 19.5 ఓవర్లల్లో 108 పరుగులకే ఆలౌట్ అయింది.

ये बहुत ही गलत बात है आपस मे ना लड़ो, इसका तो ध्यान रखो की विदेशी खिलाड़ी भी आपके बीच मे है वो क्या सोच रहे होंगे... Please Respect To All.. #LSGvRCB #ViratKohli #gautamgambhir #IPL2023 #LSGvsRCB @imVkohli @GautamGambhir pic.twitter.com/NJT0FIH5Qw
— KK (@Imkk50) May 2, 2023
ఆర్సీబీ ఇన్నింగ్‌లో కేప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఒక్కడిదే టాప్ స్కోర్. 40 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్ మాత్రమే కొట్టిన ఫాఫ్ 44 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 30 బంతుల్లో 31 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్‌లో మూడు ఫోర్లు రికార్డయ్యాయి. మిడిలార్డర్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్-16 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాటర్లెవరూ డబుల్ డిజిట్ కూడా అందుకోలేదు.
అనూజ్ రావత్-9, గ్లెన్ మ్యాక్స్‌వెల్-4, సుయాష్ ప్రభుదేశాయ్-6, మహిపాల్ లొమ్రార్-3, వనిందు హసరంగ-8 (నాటౌట్), కర్ణ్ శర్మ-2, మహ్మద్ సిరాజ్-0, హేజిల్ వుడ్-1 (నాటౌట్) పరుగులు చేశారు. ఆ తరువాత బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ ఆ స్వల్ప లక్ష్యాన్ని కూడా అందుకోలేకపోయింది. 108 పరుగులకే కుప్పకూలింది. 23 పరుగులు చేసిన కృష్ణప్ప గౌతమ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Everything after handshake here:
— aqqu who (@aq30__) May 1, 2023
Virat Kohli vs Gautam Gambhir
BIGGEST RIVALRY IN CRICKET
Entertainment into 100#RCBVSLSG #ViratKohli pic.twitter.com/8SxxSKRByn
బ్యాటింగ్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన ఆర్సీబీ.. బౌలింగ్‌లో విజృంభించింది. మ్యాచ్ ఆరంభం నుంచీ క్రమం తప్పకుండా వికెట్లను పడగొట్టింది. ఒకదశలో లక్నో జెయింట్స్ కనీసం వంద పరుగులు కూడా చేయలేదనిపించేలా సాగింది బెంగళూరు బౌలింగ్. మహిపాల్ లొమ్రార్ మినహా మిగిలిన బౌలర్లందరూ వికెట్లను పడగొట్టారు. మహ్మద్ సిరాజ్-1, జోష్ హేజిల్‌వుడ్-2, మ్యాక్స్‌వెల్-1, హసరంగ-1, కర్ణ్ శర్మ-2, హర్షల్ పటేల్-1 వికెట్లను నేలకూల్చారు.
అక్కడిదాకా బాగానే ఉన్నప్పటికీ - ఆ తరువాతే అసలు కథ మొదలైంది. విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ వాదులాటకు దిగారు. పరస్పరం ఘాటు వ్యాఖ్యలు సంధించుకున్నారు. దాదాపుగా ఇద్దరూ ఒకరినొకరు తోసుకునేంత వరకూ వెళ్లింది. మ్యాచ్ ముగిసిన అనంతరం లక్నో ఓపెనర్ కైలే మేయర్స్ నేరుగా విరాట్ కోహ్లీ వద్దకు వచ్చి.. ఏదో చెప్పడంతో ఈ గొడవ ఆరంభమైంది. దీనికి విరాట్ కోహ్లీ కూడా అంతే ఘాటుగా రిప్లై ఇవ్వడంతో గంభీర్ జోక్యం చేసుకున్నాడు.
For those who missed it#LSGvsRCB#ViratKohli #GautamGambhir #IPL2023 pic.twitter.com/tOkloeLuk6
— Faheem Manzoor (@faheemmanzoor47) May 1, 2023
కోహ్లీ-గంభీర్ అతి సమీపానికి వచ్చి గొడవ పడ్డారు. కోహ్లీ ఆ సమయంలో గంభీర్ భుజంపై చెయ్యి వేయడం కనిపించింది. గొడవ తీవ్రం కావడంతో కేఎల్ రాహుల్, ఇతర ప్లేయర్లు వారిద్దరినీ దూరంగా తీసుకెళ్లారు. అయినప్పటికీ- వారిని విడిపించుకుని మళ్లీ ఎదురెదురు రావడం స్టేడియంలో మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ ఘటనను బీసీసీఐ తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినట్లు వెల్లడించింది. ఇద్దరిపైనా కొరడా ఝుళిపించింది. విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్‌కు చెల్లించాల్సిన మ్యాచ్ ఫీజులో ఏకంగా 100 శాతం కోత పెట్టింది. కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించిన కారణంగా నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ గొడవపై సమగ్ర నివేదిక అందజేయాలని రెండు జట్ల ఫ్రాంఛైజీలను ఆదేశించింది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications