IRCTC కీలక నిర్ణయం: రూ. 10 లక్షల రైల్వే ప్రమాద బీమా, మీరు ఇలా చేస్తే సరిపోతుంది

న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) తాజాగా ప్రయాణికులకు మేలు చేసే కీలక నిర్ణయం తీసుకుంది. రైలు టికెట్ కొనుగోలు చేసిన వారికి ఈ నిర్ణయంతో ఆటోమేటిక్‌గా ప్రమాద బీమా వర్తించనుంది. కాగా, ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా రోజుకు దాదాపు 15 లక్షల మంది మంది ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఇందులో ప్రతి ఒక్కరూ బీమా ప్రయోజనాలకు అర్హులే.

అయితే, టికెట్ బుక్ చేసుకునే కొందరిలో ప్రమాద బీమాను ఎంపిక చేసుకోవడం మర్చిపోతుంటారు. దీంతో ఏదైనా జరగరానిది జరిగినప్పుడు బీమా ప్రయోజనాలకు దూరమవుతారు. ఇటీవల జరిగిన ఒడిశా రైలు ప్రమాద ఘటనలో చాలా మంది ప్రయాణికులు బీమాను ఎంపిక చేసుకోకపోవడం గమనార్హం. ఇలాంటివి పునరావృతం కాకుండా ఐఆర్‌సీటీసీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

IRCTC

అందరు ప్రయాణికులకు బీమా సదుపాయాన్ని అందించాలనే ఉద్దేశంతో ఇండియన్ రైల్వే టికెట్ బుకింగ్‌లో ఉన్న చిన్న మార్పు తీసుకొచ్చింది. కేవలం 35 పైసలకే లభించే బీమా సదుపాయాన్ని డిఫాల్ట్ చేసింది. దీంతో టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులందరికీ ఆటోమేటిక్‌గా బీమా సదుపాయం కలుగుతుంది.

ఐఆర్ఐటీసీ తాజా నిర్ణయతో వెబ్‌సైట్ లేదా యాప్‌లో టికెట్ బుక్ చేసుకునే సమయంలో ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కోసం బీమా ఆప్షన్ పక్కనున్న టిక్ బాక్స్‌ను ప్రత్యేకంగా ఎంచుకునే అవసరం లేదు. ఇక నుంచి ఆ ఆప్షన్ ను ఐఆర్‌సీటీసీ డిఫాల్ చేస్తోంది. దీంతో టికెట్లు అయిపోతాయేమోనని కొందరు తొందరలో బీమా చేయడం మర్చిపోయినా చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టికెట్ బుక్ చేసుకుంటే.. ఆటోమేటిక్‌గా ఇన్స్యూరెన్స్ కూడా తీసుకున్నట్లే అవుతుంది.

ఈ బీమాను ఎంచుకోవడం ద్వారా ప్రయాణికుడికి రూ. 10 లక్షల వరకు బీమా మొత్తం లభిస్తుంది. రైలు ప్రమాదంలో మరణించినా లేదా శాశ్వతంగా అంగవైకల్యం ఏర్పడి మరే పనీ చేయలేని పరిస్థితి ఎదురైతే బాధిత కుటుంబాలకు రూ. 10 లక్షలు అందిస్తారు. తీవ్రంగా గాయపడి అంగ వైకల్యం ఏర్పడినప్పుడు రూ. 7.5 లక్షల వరకు బీమా సొమ్ము పొందవచ్చు. అంతేగాక, క్షతగాత్రులకు వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 2 లక్షల వరకు అందిస్తారు.

అయితే, బీమా పాలసీని ఎంచుకున్న ప్రయాణికులు నామినీ వివరాలను జత చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నామినీ వివరాలు అందించకపోయినా.. నామినీ వ్యక్తి చనిపోయినా వారసులు ఈ బీమా ప్రయోజనాలు పొందుతారు. నామినీదారు లేదా ప్రయాణికులు ఈ బీమాను క్లైమ్ చేసుకువాలంటే సంబంధిత పత్రాలను తీసుకుని దగ్గర్లో ఉన్న బీమా సంస్థను సంప్రదించాల్సి ఉంటుంది. ప్రమాదం జరిగిన నాలుగు నెలల్లో బీమా తీసుకున్న వ్యక్తి వీటి ప్రయోజనాలు పొందుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+