మోదీకి ఎర్త్ పెట్టిన ఆర్ఎస్ఎస్: ప్రధాని అభ్యర్థి ఆయనే
PM Modi: దేశంలో రాజకీయ పరిణామలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. ప్రత్యేకించి- కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారనేది చర్చనీయాంశమౌతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏకు బొటాబొటి మెజారిటీ సీట్లు లభించడం, ఓట్ల లెక్కింపు తరువాత కూటమిలో లుకలుకలు ఏర్పడటం శరవేగంగా సాగిపోయాయి.
ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎన్డీఏ సంకీర్ణ కూటమికి 290కి కాస్త అటు ఇటుగా ఉంటోన్నాయి. 400లకు పైగా సీట్లను సాధిస్తామంటూ లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో ధీమాగా చెప్పిన బీజేపీ నాయకులు.. ఓట్ల లెక్కింపు సందర్భంగా వెలువడిన ఫలితాలతో డీలా పడ్డారు. బీజేపీకి అత్యంత బలమైన ఉత్తరప్రదేశ్‌లో సైతం ఉమ్మడి ప్రతిపక్షాల కూటమి ఇండియా హవా వీచింది.

ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి 235 స్థానాలు లభించాయి. ఇంకా కొన్ని చోట్ల ఆధిక్యతలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు పూర్తిగా ముగిసే సమయానికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్‌ను ప్రస్తుతానికి అందుకోలేకపోయిందీ అలయెన్స్.
ఈ క్రమంలో ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్న జనతాదళ్ (యునైటెడ్) అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు గాలం వేశారు ఇండియా కూటమి నాయకులు. ఆయనను తమ వైపు తిప్పుకొనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. తమకు మద్దతు ఇస్తే కీలక పదవి ఇస్తామంటూ హామీలను ఇస్తోన్నారు. ఇదే హామీ అటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకూ దక్కడం విశేషం.
బీజేపీ చవి చూసిన ఈ ఫలితాలు- రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో కలకలం రేపాయి. 400లకు పైగా స్థానాలను సాధిస్తామంటూ ప్రకటించిన అనంతరం కనీసం 300లను కూడా అందుకోలేకపోవడం, 290కే పరిమితం కావాల్సి రావడం ఆర్ఎస్ఎస్ టాప్ క్యాడర్‌ను ఆగ్రహావేశాలకు గురి చేసిందని చెబుతున్నారు. మోదీ వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోన్నట్లు తెలుస్తోంది.

నరేంద్ర మోదీకి ఉద్వాసన పలకాలని ఆర్ఎస్ఎస్ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ అధినేతగా మరో కొత్త నాయకుడిని ఎన్నుకునేలా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆర్ఎస్ఎస్‌కు అత్యంత ఆఫ్తుడిగా ముద్రపడిన నితిన్ గడ్కరీ బీజేపీ పార్లమెంటరీ పార్టీ చీఫ్‌గా మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
మోదీ తరువాత ఆ స్థాయిలో ఛరిష్మా గల నాయకుడు కావడం వల్లే నితిన్ గడ్కరీనేనని భావిస్తోంది. మోదీ స్థానంలో కొత్త నాయకుడి పేరును ప్రతిపాదిస్తూ త్వరలోనే ఆర్ఎస్ఎస్ ఓ తీర్మానం చేయవచ్చని అంటున్నారు.












Click it and Unblock the Notifications