కరెక్ట్ టైమ్ కొట్టిన ఐటీ శాఖ, టాప్ పొలిటికల్ లీడర్ క్లోజ్ ఫ్రెండ్, రూ. 20 కోట్లు గోవింద !

బెంగళూరు/మైసూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా పలువురి మీద ఐటీ శాఖ అధికారులు, ఎన్నికల అధికారులు కన్ను వేశారు. ఇప్పటికే బెంగళూరు సిటీతో పాటు కర్ణాటకలోని అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల సరిహద్దుల్లో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులతో కలిసి అన్ని విహనాల్లో సోదాలు చేస్తున్నారు.

పలువురు రాజకీయ పార్టీల నాయకుల మీద అధికారులు డేగకన్ను వేశారు. బెంగళూరు నగరంలో ఇటీవల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టు సమీపంలోనే ఆటోలో రెండు కోట్ల రూపాయల నగదును అధికారులు సీజ్ చేశారు. ఇప్పుడు ఓ ఫైనాన్సియర్ కు చెందిన ఇంటిలో సోదాలు చేసిన అధికారుల దిమ్మతిరిగిపోయింది.

cash

బెంగళూరులోని ఓ ఫైనాన్సియర్ కు చెందిన ఇంటిలో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేశారు. శాంతినగర్, శివాజీనగర్, ఆర్ఎంబీ ఎక్స్ టెన్షన్, కన్నింగ్ హోమ్ రోడ్డు, సదాశివనగర్, కుమారపార్క్ వెస్ట్, ఫేర్ ఫఈల్డ్ లేఔట్ తో పాటు మైసూరులో ఆయనకు చెందిన భవనాల మీద ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు.

ఫైనాన్సియర్ కు చెందిన ఇంటిలోని ఓ రహస్య గదిలో చాలా బ్యాగుల్లో రూ. 500 నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఆ నోట్ట కట్టలు లెక్కించడానికి అధికారులకు అర్దరోజు సమయం పట్టింది. ఆ ఫైనాన్సియర్ ఇంటిలో సుమారు రూ. 15 కోట్ల క్యాష్ తో పాటు రూ. 5 కోట్ల విలువైన బంగారు నగలు ఉన్నాయని వెలుగు చూసింది.

ఫైనాన్సియర్ ఇంటిలో భారీ మొత్తంలో నగదు సీజ్ చేశామని ఐటీ శాఖకు చెందిన ఓ అధికారి ప్రముఖ కన్నడ టీవీ చానల్ కు చెప్పారు.ఐటీ శాఖ అధికారులు దాడులు చేసి నగదు సీజ్ చేసిన ఆ ఫైనాన్సియర్ కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ కు సన్నిహితుడు అని కన్నడ మీడియా తెలిపింది. అయితే ఐటీ శాఖ దాడులు చేసిన ఆ ఫైనాన్సియర్ పేరు, వివరాలు చెప్పడానికి ఆదాయపన్ను శాఖ అధికారులు నిరాకరించారని కన్నడ మీడియా తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+