Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IT HUB: వందల కోట్ల హవాలా సొమ్ము, 2 వేల బ్యాంకు అకౌంట్లలో ?, దుబాయ్ లో బాస్, బెంగళూరులో డీల్ !

బెంగళూరు/కొచ్చి/ చెన్నై: నిరుద్యోగులు, కరోనా వైరస్ దెబ్బతో కష్టాలు ఎదుర్కొంటున్న సామాన్య ప్రజలను టార్గెట్ చేసుకున్న నిందితులు పెద్ద స్కెచ్ వేశారు. విదేశాల్లో కుర్చున్న బాస్ చెప్పినట్లు ఐటీ హబ్ లో ఉన్న నలుగురు వ్యక్తులు కచ్చితంగా చేస్తున్నారు. విలాసవంతమైన ఇంటిని అద్దెకు తీసుకుని వ్యాపారం చేసే ముసుగులో నిందితులు అదిరిపోయే దుస్తులు వేసుకుని బయటకు వెలుతున్నారు. తరువాత బాస్ చెప్పినట్లు చేస్తూ రాత్రి ఇంటికి వెలుతున్నారు. ఏటీఎం కేంద్రం దగ్గర ఓ బ్యాగ్ తగిలించుకుని అనుమానాస్పదంగా నిలబడి ఉన్న వ్యక్తిని అదే ఏటీఎంలో డబ్బులు తీసుకోవడానికి వెళ్లిన వ్యక్తి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ? అని ప్రశ్నించాడు. ఆ సమయంలో నన్ను ఇక్కడ చూసినట్లు ఎవ్వరికి చెప్పకండి అంటూ ఆ నిందితుడు ప్రశ్నించిన వ్యక్తికి డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నించాడు. అతనికి ఇంకా అనుమానం ఎక్కువ రావడంతో గట్టిగా కేకలు వేశాడు. స్థానికులు గుమికూడటంతో బ్యాగ్ లో ఉన్న పెద్ద కొడవలి తీసుకుని స్థానికుల మీద దాడి చేసి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించి పోలీసులకు చిక్కిపోయాడు. పోలీసుల విచారణలో అతనితోపాటు మరో ముగ్గురు కలిసి వందల కోట్ల రూపాయల హవాల సొమ్ము 2,656 బ్యాంకుల్లో డిపాజిట్ చేసినట్లు వెలుగు చూడటంతో ఐటీ హబ్ పోలీసులు బిత్తరపోయారు.

గల్ఫ్ లో ఉద్యోగాలు వదిలేసి బెంగళూరులో మకాం

గల్ఫ్ లో ఉద్యోగాలు వదిలేసి బెంగళూరులో మకాం

కేరళకు చెందిన మోహమ్మద్ సాహిల్, ఫైసల్, ఫజల్, అబ్దుల్ అనే నిందితులు బెంగళూరు చేరుకుని జేపీ నగర్ 6వ ఫేస్ లో విలాసవంతమైన అద్దె ఇంటిని తీసుకుని నివాసం ఉంటున్నారు. ఈ నలుగురిలో ముగ్గురు గల్ఫ్ లో ఉద్యోగాలు చేశారు. కరోనా వైరస్ (Covid-19) దెబ్బతో గల్ఫల్ లో ఉద్యోగాలు మానేసి తరువాత బెంగళూరు వచ్చి ఇక్కడే నివాసం ఉంటున్నారు.

వ్యాపారం ముసుగులో

వ్యాపారం ముసుగులో

బెంగళూరులోని జేపీ నగర్ లో విలాసవంతమైన ఇంటిని అద్దెకు తీసుకుని వ్యాపారం చేసే ముసుగులో ఈ నలుగురు నిందితులు అదిరిపోయే దుస్తులు వేసుకుని బయటకు వెలుతున్నారు. తాము వ్యాపారం చేస్తున్నామని ఇంటి యజమానితో పాటు స్థానికంగా పరిచయం అయిన కొంతమందికి వీళ్లు చెప్పారు. అయితే దుబాల్ లో కుర్చున్న బాస్ చెప్పినట్లు చేస్తున్న నలుగురు కిలాడీలు ప్రతిరోజూ రాత్రి జేపీ నగర్ లోని వారు నివాసం ఉంటున్న ఇంటికి వెలుతున్నారు.

నిరుద్యోగులు, కరోనా కష్టాల్లో ఉన్న వారు టార్గెట్

నిరుద్యోగులు, కరోనా కష్టాల్లో ఉన్న వారు టార్గెట్


నిరుద్యోగులు, కరోనా వైరస్ దెబ్బతో కష్టాలు ఎదుర్కొంటున్న సామాన్య ప్రజలను టార్గెట్ చేసుకున్న ఈ నిందితులు పెద్ద స్కెచ్ వేశారని వెలుగు చూసింది. దుబాయ్ లో కుర్చున్న బాస్ చెప్పినట్లు ఐటీ హబ్ బెంగళూరులో ఉన్న ఈ నలుగురు వ్యక్తులు కచ్చితంగా చేస్తున్నారు. దుబాయ్ చెప్పినట్లు బెంగళూరులోని పలు బ్యాంకుల్లోని అకౌంట్లలో నిందితులు రూ. 50 వేలు చొప్పున డబ్బు డిపాజిట్ చేస్తున్నారు.

బ్యాంకుల్లో అనుమానం వస్తుందని ?

బ్యాంకుల్లో అనుమానం వస్తుందని ?

బ్యాంకులకు వెలితే అనుమానం వస్తుందనే గుర్తించి ఏటీఎం కేంద్రాల్లో ఉన్న సీడీఎం యంత్రాల్లో దుబాయ్ బాస్ ఇచ్చిన బ్యాంకు అకౌంట్లలో నిందితులు డబ్బులు డిపాజిట్ చేసి వెళ్లిపోతున్నారు. నిందితులు డబ్బులు డిపాజిట్ చేస్తున్న బ్యాంకు అకౌంట్లు దాదాపుగా కేరళ వ్యాపారులవి అని వెలుగు చూసింది.

ఏటీఎం కేంద్రంలో ?

ఏటీఎం కేంద్రంలో ?

జేపీ నగర్ 6వ ఫేస్ లోని జరగనహళ్ళిలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం కేంద్రం దగ్గర ఓ బ్యాగ్ తగిలించుకుని అనుమానాస్పదంగా నిలబడి ఉన్న మోహమ్మద్ సాహిల్ ను అదే ఏటీఎంలో డబ్బులు తీసుకోవడానికి వెళ్లిన వ్యక్తి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ? అని ప్రశ్నించాడు. ఆ సమయంలో నన్ను ఇక్కడ చూసినట్లు ఎవ్వరికి చెప్పకండి అంటూ మోహమ్మద్ సాహిల్ అతన్ని ప్రశ్నించిన వ్యక్తికి ఏకంగా రూ. 5 వేలు డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నించాడు.

కొడవలితో హంగమా చేసి చిక్కిపోయాడు

కొడవలితో హంగమా చేసి చిక్కిపోయాడు

అతనికి ఇంకా అనుమానం ఎక్కువ రావడంతో గట్టిగా కేకలు వేశాడు. ఆ సమయంలో మెహమ్మద్ సాహిల్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించాడు. స్థానికులు గుమికూడటంతో బ్యాగ్ లో ఉన్న పెద్ద కొడవలి తీసుకున్న మెహమ్మద్ సాహిల్ స్థానికుల మీద దాడి చేసి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అదే సమయంలో గస్తీ తిరుగుతున్న పుట్టేనహళ్ళి పోలీసులు అక్కడికి చేరుకుని మెహమ్మద్ సాహిల్ ను పట్టుకోవడంతో అసలు మ్యాటర్ బయటకు వచ్చింది. నిందితుడి దగ్గర బ్యాగులో రూ. 1 లక్ష నగదు, కొడవలి ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది.

 రూ. వందల కోట్ల హవాల సొమ్ము

రూ. వందల కోట్ల హవాల సొమ్ము

బెంగళూరులోని పుట్టేనహళ్లి పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు బయటకు వచ్చాయి. దుబాయ్ లో మకాం వేసిన కేరళ బాస్ చెప్పినట్లు నిందితులు పలు బ్యాంకు అకౌంట్లలో డబ్బులు వేస్తున్నారని వెలుగు చూసింది. దుబాయ్ వ్యక్తి ఫోన్ చేసిన వెంటనే నిందితులు అతను చెప్పిన ప్రాంతానికి వెలుతున్నారని, ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు రూ. 20 లక్షలు, రూ. 30 లక్షలు డబ్బు ఉన్న బ్యాగులు వీళ్లుకు ఇచ్చి వెళ్లిపోతున్నారని వెలుగు చూసింది.

నెలకు ఒక్కొక్కరికి రూ. 60 వేలు కమీషన్

నెలకు ఒక్కొక్కరికి రూ. 60 వేలు కమీషన్

దుబాయ్ బాస్ ఇచ్చిన బ్యాంకు అకౌంట్లలో వీళ్లు తరువాత రూ. 50 వేలు చొప్పున ప్రతిరోజూ డిపాజిట్ చేస్తున్నారని వెలుగు చూసింది. నిందితులు కేవలం బాస్ చెప్పినట్లు బ్యాంకు అకౌంట్లలో డబ్బులు డిపాజిట్ చేస్తే ఒక్కొక్కరికి రూ. 60 వేలు చోప్పున కమీషన్ ఇస్తున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ప్రతిరోజు వీరు హవాల సొమ్మును పలువురి బ్యాంకు అకౌంట్లలో డిపాజిట్ చేస్తున్నారని పోలీసులు గుర్తించారు.

2,656 బ్యాంకు అకౌంట్లకు రూ. వేల కోట్ల హవాలా సొమ్ము !

2,656 బ్యాంకు అకౌంట్లకు రూ. వేల కోట్ల హవాలా సొమ్ము !

పోలీసుల విచారణలో ఇప్పటికే నిందితులు 185 బ్యాంకు అకౌంట్లల్లో ఏకంగా రూ. 31 కోట్ల హవాలా సొమ్ము డిపాజిట్ చేశారని, ఆ బ్యాంకు స్టేట్ మెంట్లు తీసుకున్నామని పోలీసులు అంటున్నారు. మిగిలిన 2, 471 బ్యాంకు అకౌంట్ల స్టేట్ మెంట్లు ఇవ్వాలని బ్యాంకు అధికారులకు సూచించామని పోలీసులు అన్నారు. నిందితులు మోహమ్మద్ సాహిల్, ఫైసల్, ఫజల్, అబ్దుల్ అరెస్టు చేశామని, వీరి బాస్, కేరళకు చెందిన కింగ్ పిన్ కోసం గాలిస్తున్నామని బెంగళూరులోని పుట్టేనహళ్లి పోలీసు అధికారులు తెలిపారు. మొత్తం మీద బెంగళూరు కేంద్రంగా వేల కోట్ల హవాలా సొమ్ము చెలామణి అవుతోందని వెలుగు చూడటంతో ఐటీ హబ్ ప్రజలు హడలిపోయారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+