ప్రధాని మోడీ దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించనున్నారా?: నిజమెంత?
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగంలోని ఆర్థికల్ 360 కింద దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటిస్తారనే వార్త ప్రచారం జరుగుతోంది. సోసల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుండటంతో ఈ వార్త నిజమేమోనని పలువురు నమ్ముతున్నారు. ఓ ఆన్ లేన్ వెబ్‌సైట్ కూడా ఈ మేరకు ఓ వార్త కథనాన్ని ప్రచురితం చేసింది. అయితే, ఇందులో ఏ మాత్రం నిజం లేదు.
కొవిడ్-19 వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 360 కింద కేంద్ర ప్రభుత్వం ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటిస్తుందని సదరు వెబ్‌సైట్ పేర్కొంది. అయితే, ఇది ఒక తప్పుడు వార్తా కథనం అని, కేంద్ర ప్రభుత్వం అలాంటి నిర్నయం ఏమీ తీసుకోవడం లేదని ప్రసార భారతి న్యూస్ సర్వీస్ స్పష్టం చేసింది. ఇలాంటి వార్తలను నమ్మవద్దని తేల్చి చెప్పింది.

ఆర్ఠికల్ 360 అంటే ఏమిటి?
కేంద్ర ప్రభుత్వం దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించేందుకు ఆర్ఠికల్ 360 అనుమతిస్తుంది. ఈ ఆర్టికల్ ప్రకారం ప్రధాని, కేంద్ర మంత్రి మండలి సూచన మేరకు రాష్ట్రపతి దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆర్థిక వనరులను రాష్ట్రాలు ఎలా వినియోగించుకోవాలో కూడా కేంద్రం సూచనలు చేస్తుంది.
#FakeNewsBusted https://t.co/F2eekZ77Xk
— Prasar Bharati News Services (@PBNS_India) March 24, 2020
ఆర్థిక స్థిరత్వం లేదా రుణ భారం పెరగడం లేదా దేశంలోని ఏదైనా ప్రాంతం ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొనే పరిస్థితిలో కేంద్రం సూచనలపై రాష్ట్రపతి సంతృప్తి చెంది ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించే అవకాశం ఉంటుందని ఈ ఆర్టికల్ స్పష్టం చేస్తోంది.












Click it and Unblock the Notifications