కేరళలో హాట్ సీట్లు ఇవే: దేశం దృష్టి ఈ స్థానాలపైనే..!

కేరళ: నలభైరోజుల పాటు సుదీర్ఘ ప్రచారం తర్వాత కేరళలో ఒకే సారి అన్ని లోక్‌సభ స్థానాలకు మూడవదశలో పోలింగ్ జరుగుతోంది. కేరళ నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు కేంద్రమంత్రి అల్ఫోన్స్, సిట్టింగ్ ఎంపీ శశి థరూర్‌లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక్కడ అధికారిక కమ్యూనిస్టు పార్టీకి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు ప్రతిష్టాత్మకంగా మారాయి ఈ ఎన్నికలు. కేరళలో మొత్తం 20 లోక్‌సభ స్థానాలున్నాయి.

ఇక కమ్యూనిస్టులు కాంగ్రెస్‌లకు బీజేపీ సవాల్ విసురుతోంది. మూడు నియోజకవర్గాల్లో బీజేపీ గట్టిపోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరువనంతపురం, పతనంతిట్ట, త్రిసూర్ నియోజకర్గాల్లో బీజేపీ ఖాతా తెరవాలని భావిస్తోంది. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశం అంశాన్ని బీజేపీ అవకాశంగా మలుచుకోవాలని భావిస్తోంది. ఇదే అంశంపై ఎన్నికల్లో గెలవాలని కమలనాథులు స్కెచ్ వేశారు. ఎన్నికల ప్రచారంలో కూడా అధికారిక సీపీఐ పార్టీని, కాంగ్రెస్ పార్టీని శబరిమల అంశంలో విమర్శలు గుప్పించారు.

Its a do or die situation for Congress and Communists in Kerala

వాయనాడ్ నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బరిలోకి దిగడంతో దేశవ్యాప్తంగా ఈ నియోజకవర్గానికి ప్రాధాన్యత సంతరించుకుంది. తిరువనంతపురం నుంచి శశిథరూర్ హ్యాట్రిక్ విజయం కోసం ఎదురుచూస్తున్నారు . శశిథరూర్ పై మిజోరాం మాజీ గవర్నర్ బీజేపీ నేత కుమ్మనం రాజశేఖరన్ బరిలో నిలిచారు.ఎర్నాకులం నుంచి తొలిసారిగా బరిలో దిగుతున్నారు కేంద్రమంత్రి అల్ఫోన్స్ కన్నమతనం.ఇక కేరళలో బీజేపీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ, జాతీయాధ్యక్షుడు అమిత్ షాలు స్టార్ క్యాంపెయినర్లుగా నిలువగా... కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ అక్కడ ప్రచారం నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+