వరుస ఎన్కౌంటర్లు: 8మంది ఉగ్రవాదుల హతం, నలుగురు జవాన్లకు గాయాలు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో తాజాగా చోటు చేసుకున్న వరుస ఎన్కౌంటర్లతో ఉగ్రవాదులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్ సరిహద్దు జిల్లాల్లో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఎన్కౌంటర్లలో ఎనిమిది మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
సోఫియాన్ జిల్లాలో రెండు చోట్ల, అనంతనాగ్ జిల్లాలో ఒకచోట ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. సోఫియాన్ జిల్లా కచ్చాదోరా ఏరియా, ద్రాగాడ్ గ్రామాల్లోకి సాయుధులు చొరబడ్డారన్న సమాచారంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి.

ఈ క్రమంలో ఎదురుకాల్పులు చోటుచేసుకోగా ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల కాల్పుల్లో నలుగురు జవాన్లకు గాయాలయ్యాయి. అటు అనంతనాగ్ జిల్లాలోని దైల్‌గావ్ ప్రాంతంలో.. ఉగ్రవాదులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
ఈ ఘటనలో ఒక మిలిటెంట్ హతమయ్యాడు. కాగా, మరో ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం భద్రతాదళాలు వేట కొనసాగిస్తున్నాయి.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications