బుఖారీని చంపింది పాకిస్థాన్ ఎల్టీ ఉగ్రవాదులే: ఓ కాశ్మీరీ సహకారం
శ్రీనగర్: సీనియర్ పాత్రికేయుడు, రైజింగ్ కాశ్మీర్ సంపాదకుడు షుజాత్ బుఖారీని హత్య చేసింది పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులేనని జమ్మూకాశ్మీర్ పోలీసులు తేల్చారు. ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు, మరో కాశ్మీరీ యువకుడు ఈ హత్యకు పాల్పడినట్లు వెల్లడించారు.
అంతేగాక, బుఖారీ హత్యకు పాకిస్థాన్‌లోనే కుట్ర పన్నారని కాశ్మీర్ జోన్ ఐజీ స్వయం ప్రకాశ్ తెలిపారు. నిందితుల ఫొటోలను కూడా గురువారం పోలీసులు విడుదల చేశారు. హత్య జరిగిన ప్రాంతంలో రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని వాటి ద్వారా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.

'బుఖారీని లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హత్య చేశారు. పాకిస్థాన్ నుంచే ఇందుకు కుట్ర పన్నారు. దీనికి సంబంధించిన సరైన సాక్ష్యాధారాలు మా వద్ద ఉన్నాయి' అని స్వయం ప్రకాశ్ వెల్లడించారు. కాగా, కాగా.. నిందితుల్లో ఒకర్ని పాకిస్థాన్‌కు చెందిన లష్కరే ఉగ్రవాది నవీద్ జాట్‌గా ఇప్పటికే గుర్తించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న నవీద్ ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీనగర్‌లోని శ్రీ మహారాజా హరిసింగ్ ఆసుపత్రిలో జరిగిన ఉగ్రదాడి సమయంలో తప్పించుకున్నాడు. జూన్ 14న బుఖారీ ఈ ఉగ్రవాదుల చేతిలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications