Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మధ్యలో రాకు.. ట్రంప్ కు జై శంకర్ సీరియస్ వార్నింగ్..!

భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తతల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు నానాటికి పెచ్చుమీరిపోతోంది. ఇరు దేశాల మధ్య యుద్ధం ఆపింది తానేనంటూ ఎక్కడ పడితే అక్కడ చెప్పుకుంటూ తిరుగుతున్నారు. మొన్న గల్ఫ్ దేశాల పర్యటనలో ఇదే టాపిక్ ఎత్తారు. తాను జోక్యం చేసుకోవడంతోనే భారత్- పాకిస్థాన్ మధ్య అణుయుద్ధం ఆగిపోయిందని చెప్పుకొచ్చారు.

తాజాగా దక్షిణాఫిక్రా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా వైట్ హౌస్ కు విచ్చేయగా.. ఆయనతో జరిపిన చర్చల్లోనూ ఈ విషయం ప్రస్తావించారు.అంతేకాక అనేక మీడియా సమావేశాల్లో ట్రంప్ పాడిన పాటే మళ్లీ పాడుతున్నారు. తనవల్లే యుద్దం ఆగిపోయిందని తానే ఇరు దేశాలను ఒప్పించానని చెప్పుకుంటున్నారు. దీంతో ఈ విషయంపై భారత విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

కాల్పుల విరమణ ఒప్పందంపై భారత్- పాకిస్థాన్ మధ్యే చర్చలు జరిగాయని మూడో దేశం ప్రమేయం ఇందులో లేదని స్పష్టం చేశారు. తన వల్లే యుద్ధం ఆగిపోయిందని చెప్పుకుంటున్న ట్రంప్ కు జైశంకర్ సీరియస్ కౌంటర్ ఇచ్చారు. భారత్- పాక్ మధ్యే చర్చలు జరిగాయని తేల్చి చెప్పారు. అమెరికా జోక్యం లేదని తెలిపారు.

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై ప్రపంచ దేశాలకు ముందే చెప్పామని జై శంకర్ స్పష్టం చేశారు. ఆయా దేశాలకు ముందే సమాచారం ఇచ్చామని అందులో అమెరికా కూడా ఉందని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. పదే పదే ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై ఆయన సీరియర్ అయ్యారు. కాశ్మీర్ సమస్య తమదని ఈ విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని కుండబద్దలు కొట్టారు.

Jaishankar No U S Role in India-Pakistan Ceasefire Agreement

భారత్- పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ అవగాహన తర్వాతే ఈ విషయాన్ని వైట్ హౌజ్ కు చెప్పామని జై శంకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు నెదర్లాండ్స్ లో ఓ మీడియా సంస్థతో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కాల్పుల విరమణ విషయంలో మొదట పాకిస్థాన్ ఆర్మీ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని అన్నారు. ఆ తర్వాతే భారత్ నిర్ణయం తీసుకుందన్నవారు. హాట్ లైన్ ద్వారా ఇరు దేశాల మధ్య చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు.

ఆ సమయంలో అమెరికా మధ్యవర్తిత్వం వహించిందా..? అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు.. అమెరికా అమెరికాలోనే ఉందని భారత్ లోకి రాలేదని జై శంకర్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ట్రంప్ వైఖరిని ఆయన ఖండించారు. ట్రంప్ మాటల్లో వాస్తవం లేదన్నారు. అలా అనుకుంటే.. కాల్పులు ఆపేయమని అమెరికా మాత్రమే తమకు చెప్పలేదని.. చాలా దేశాలు సూచనలు చేశాయని వివరించారు. కానీ అమెరికా మాత్రమే పలుమార్లు ఈ విషయాన్ని ప్రస్తావిస్తోందన్నారు.

భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ప్రస్తుతం నెదర్లాండ్స్ పర్యటనలో ఉన్నారు. ఈ మేరకు అక్కడి మీడియాతో ఆయన మాట్లాడారు. భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తతలు, అమెరికా వైఖరిపై స్పందించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ కు మద్దతు ఇచ్చిన డచ్ ప్రధాని డిక్ స్కూఫ్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+