అన్నీ మానేసి ఆసుపత్రి వద్దే, కోలుకుంటున్న జయలలిత
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కోసం చాలామంది అభిమానులు, కార్యకర్తలు తమ తమ పనిని ఆపేశారు. ఆమెకు చికిత్స అందిస్తున్న అపోలో ఆసుపత్రి వద్దే రోజుల తరబడి మకాం వేశారు. అమ్మ ఆరోగ్యం గురించి ఎప్పటికి అప్పుడు వాకబు చేస్తున్నారు.
ఉదాహరణకు.. వెల్లూరు జిల్లా వనియంబడికి చెందిన జలాల్ బాయి అనే వ్యక్తి అపోలో ఆసుపత్రి వద్ద ఉంటున్నారు. అతను వృత్తిరీత్యా దర్జీ. ఆయన మాత్రం ఆసుపత్రి వద్దే అమ్మ ఆరోగ్యం గురించి వాకబు చేస్తూ కనిపిస్తున్నారు. నేను నా పనిని పక్కన పెట్టి వచ్చేశానని, అమ్మ త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నానని చెప్పారు.
రాత్రి పూట తాను ఎమ్మెల్యే హాస్టల్ వద్ద కల కారిడార్ పైన నిద్రపోతున్నానని చెప్పాడు. సురేష్ బాబు అనే వ్యక్తి మార్కెటింగ్ చేస్తుంటాడు.య అతనిది ప్రయివేటు ఉద్యోగం. తాను సెప్టెంబర్ 23వ తేదీ నుంచి ఇక్కడే నిరీక్షిస్తున్నానని చెప్పాడు. అమ్మ ఆరోగ్యంతో మళ్లీ తిరిగి రావడమే తనకు కావాలని చెబుతున్నాడు.

ఇదిలా ఉండగా, జయలలిత క్రమంగా కోలుకుంటున్నారు. ఆమె మంచినీరు, ఉడకబెట్టిన యాపిల్ పండ్లను తీసుకుంటున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆది నుంచి ఆమెకు అపోలో వైద్యులతో పాటు లండన్‌కు చెందిన వైద్యులు రిచర్డ్ బీలే, ఎయిమ్స్ వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
తాజాగా సింగపూర్‌కు చెందిన మరో ఇద్దరు వైద్యనిపుణులు కూడా ఫిజియోథెరపీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె మెల్లగా కోలుకుంటున్నారు. అంతేగాక తనకు చికిత్స అందిస్తున్న వైద్యులందరికీ పేరుపేరునా ఆమె కృతజ్ఞతలు కూడా తెలిపారని ఆస్పత్రివర్గాలు వివరించాయి.












Click it and Unblock the Notifications