జయలలితకు చికిత్స: 2016 అక్టోబర్ 3వ తేదీ అపోలో ఆసుపత్రి ఏం చెప్పిందంటే !
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై ప్రత్యేక కమిషన్ విచారణ ముమ్మరం చేసింది.
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై ప్రత్యేక కమిషన్ విచారణ ముమ్మరం చేసింది. గత సంవత్సరం ఇదే రోజు (అక్టోబర్ 3వ తేది) జయలలితకు అందిస్తున్న చికిత్స విషయంలో అపోలో ఆసుపత్రి వర్గాలు హెల్తె బులిటెన్ మీడియాకు విడుదల చేశారు.
జయలలిత ఆరోగ్యం కుదటపడుతోందని, ఆమె చికిత్సకు సహకరిస్తున్నారని చెన్నైలోని గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆసుపత్రి చీఫ్ ఆపరేటర్ అధికారి సుబ్బయ్య విశ్వనాథన్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. జయలలిత ఇన్ఫెక్షతో బాధపడుతున్నారని వివరించారు.

జయలలిత ఆరోగ్యం కుదటపడుతోందని, ఆమె విశ్రాంతి తీసుకోవడానికి ఇంకా ఆసుపత్రిలో ఉండాలని అపోలో ఆసుపత్రి వర్గాలు 2016 అక్టోబర్ 3వ తేదీ పత్రికా ప్రకటన విడుదల చేశారు. అదే రోజు అమ్మ జయలలిత ఇండ్లీ, చెట్నీ తిన్నారని పలువురు మంత్రులు మీడియాకు చెప్పారు.
అపోలో ఆసుపత్రి వర్గాలతో పాటు మంత్రులు చెప్పిన మాటలు అన్నీ రివర్స్ అయ్యాయి. జయలలిత మృతిపై విచారణ చేస్తున్న ప్రత్యేక కమిషన్ అసలు వాస్తవాలు బయటకు తీసే పనిలో నిమగ్నం అయ్యారు. గత సంవత్సరం అక్టోబర్ 3వ తేదీ అపోలో ఆసుపత్రి వర్గాలు జయలలిత చికిత్స విషయంలో విడుదల చేసిన పత్రికా ప్రకటన ఇప్పుడు మళ్లీ తెరమీదకు వచ్చింది.












Click it and Unblock the Notifications