జయలలిత ఆరోగ్యంపై పిటిషన్: 2 ని.ల్లో కొట్టేసిన హైకోర్టు, కీలక వ్యాఖ్యలు
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం గురించిన వివరాలను పూర్తిస్థాయిలో వెల్లడించాలని వేసిన పిటిషన్‌న హైకోర్టు గురువారం నాడు కొట్టివేసింది. ఈ పిటిషన్ పైన వాదనలను కేవలం రెండు నిమిషాల్లో న్యాయస్థానం ముగించింది.
జయలలితపై తీవ్ర ఒత్తిడి: తెరపైకి 'డిప్యూటీ', రేసులో వీరే
ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చికిత్స ఎన్ని రోజులు అనే విషయాన్ని ఎవరూ చెప్పలేరని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి విషయాలను రాజకీయాలకు వాడుకోవడం ఏమాత్రం సరికాదని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ పిటిషన్ పబ్లిక్ ఇంటరెస్టులా లేదని, పబ్లిసిటీ ఇంటరెస్టులా ఉందని పేర్కొంది.

కాగా, తీవ్ర అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరిన జయలలితకు వైద్యులు చికిత్స కొనసాగిస్తున్నారు. కొన్ని రోజులుగా ఆమె ఆరోగ్యం కాస్త మెరుగైనట్లు తెలుస్తోంది. జయలలిత మరికొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండాల్సి ఉంటుందని తెలుస్తోంది.
ఢిల్లీ ఎయిమ్స్ నుంచి ముగ్గురు ప్రత్యేక వైద్యులను చెన్నైకి రప్పించారు. ఊపిరితిత్తుల వ్యాధి నిపుణుడు, హృద్రోగ నిపుణుడు, మత్తు వైద్య నిపుణుడు గురువారం చెన్నైకి వచ్చారని సమాచారం. మరోవైపు జయలలితకు చికిత్స జరుగుతున్న అపోలో ఆసుపత్రికి రాష్ట్ర మంత్రులు, అన్నాడీఎంకే శాసనసభ్యులు, ముఖ్యనేతలు బారులు తీరారు.
హైకోర్టు ఆదేశాలతో స్థానిక సంస్థల ఎన్నికలు రద్దు కావడంతో జిల్లాల నుంచి కూడా నేతలు పెద్ద సంఖ్యలో అపోలో ఆసుపత్రికి చేరుకుని అమ్మ ఆరోగ్యం గురించి ఆరా తీయడం కనిపించింది. సాధారణ రోగులకు ఇబ్బంది తలెత్తకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.












Click it and Unblock the Notifications