వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శశికళకు షాక్: జయలలిత చికిత్స: ఆ విషయం బయటపెట్టేసిన సీఎస్ గిరిజ !

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత చికిత్స నివేదికలు బయటకు వచ్చిన తరువాత మన్నార్ గూడి మాఫియా గ్యాంగ్ ఆందోళన చెందుతోంది

|
Google Oneindia TeluguNews

న్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత చికిత్స నివేదికలు బయటకు వచ్చిన తరువాత మన్నార్ గూడి మాఫియా గ్యాంగ్ ఆందోళన చెందుతోంది. అసలు విషయం తమిళనాడు ప్రభుత్వం నుంచి అధికారికంగా బయటకు వచ్చేయడంతో ఇప్పుడు శశికళ వర్గీయులు హడలిపోతున్నారు.

తమిళనాడు ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణన్ ఢిల్లీ చేరుకుని ఎయిమ్స్ వైద్యుల దగ్గర నివేదిక తీసుకుని ఐదు పేజీల ప్రెస్ రిలీజ్ తయారు చేశారు. తరువాత ప్రోటోకాల్ ప్రకారం ఆ నివేదికను తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ కు పంపించారు.

పోలీసులకు షాక్ ఇచ్చిన పన్నీర్ సెల్వం, అక్కడ కాదన్నుందుకే !పోలీసులకు షాక్ ఇచ్చిన పన్నీర్ సెల్వం, అక్కడ కాదన్నుందుకే !

Jayalalithaa was breathless with low oxygen saturation resulting in drowsiness on Sep. 22

గిరిజా వైద్యనాథన్ జయలలిత చికిత్స నివేదికను పరిశీలించారు. ఆ నివేదిక ఢిల్లీలోని రాధాకృష్ణన్ చేతికి వచ్చిన తరువాత వాటిలో మార్పులు చేయించాలని శశికళ అక్క కుమారుడు టీటీవీ దినకరన్ ప్రయత్నించారని సమాచారం.

అయితే గిరిజా వైద్యనాథన్ తమిళనాడు ప్రభుత్వ సమాచార శాఖ ప్రతినిధులతో వెంటనే నివేదికలోని పూర్తి వివరాలను ఈ మెయిల్స్ లో అన్ని మీడియా సంస్థలకు పంపించేశారు. తరువాత ఢిల్లీలో రాధాకృష్ణన్ చేతికి వెళ్లిన నివేదిక పేపర్లను ఆయన మీడియా చేతికి స్వయంగా ఇచ్చారు.

అయితే అప్పటికే జయలలితకు అందించిన చికిత్స వివరాల అసలు విషయాలు మీడియా చేతికి వెళ్లిపోయాయి. సెప్టెంబర్ 22వ తేది రాత్రి 10 గంటల సమయంలో పోయెస్ గార్డెన్ నుంచి అపోలో ఆసుపత్రికి ఫోన్ చేసి జయలలితను తీసుకు వెళ్లడానికి అంబులెన్స్ పంపించాలని చెప్పారని నివేదికలో స్పష్టంగా ఉంది.

పన్నీర్, శశికళకు నార్కో అనాలసీస్ పరీక్షలు: జయ మృతిపై డిమాండ్ !పన్నీర్, శశికళకు నార్కో అనాలసీస్ పరీక్షలు: జయ మృతిపై డిమాండ్ !

Jayalalithaa was breathless with low oxygen saturation resulting in drowsiness on Sep. 22

జయలలితను ఆసుపత్రికి తీసుకు వచ్చే సమయానికి ఆమె స్పృహలో లేరని, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులకు గురైనారని స్పష్టంగా ఉంది. ఈ విషయం బయటకు రావడంతో జయలలిత అపోలో ఆసుపత్రిలో చేరక ముందు పోయెస్ గార్డెన్ లో ఏమి జరిగింది ? అని ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తున్నారు.

పోయెస్ గార్డెన్ లోనే జయలలిత స్పృహలో లేరనే విషయం బయటకు రావడంతో ఇప్పుడు శశికళ వర్గం ఈ గండం నుంచి ఎలా బయటపడాలి ? అని ఆందోళన చెందుతున్నారు. సిన్సియర్ ఐఏఎస్ అధికారినిగా గుర్తింపు తెచ్చుకున్న గిరిజా వైద్యనాథన్ మన్నార్ గుడి మాఫియాకు లొంగకుండా తన పని తాసు చేశారని స్పష్టం అయ్యింది..

రాధాకృష్ణన్ ను మాయ చేసి నివేదిక తారుమారు చెయ్యాలని ప్లాన్ చేసిన మన్నార్ గుడి మాఫియా ఇప్పుడు ఇరకాటంలో పడింది. జయలలిత అపోలో ఆసుపత్రిలో చేరకముందు పోయెస్ గార్డెన్ లోని ఆమె ఇంటిలో ఏమి జరిగింది ? అనే విషయం శశికళ అండ్ టీం కచ్చితంగా ఇప్పుడు బయటకు చెప్పే పరిస్థితి ఎదురైయ్యింది. ఈ అసలు విసయం బయటకు రావడానికి కారణం అయిన గిరిజా వైద్యనాథన్ ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పన్నీర్ సెల్వం నియమించిన విషయం తెలిసిందే.

English summary
Sources said that Sasikala's relatives shocked over the TamilNadu govt's official statemnet which said that "Jayalalithaa was breathless with low oxygen saturation resulting in drowsiness on Sep. 22".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X