Jayalalithaa: 27 కేజీల బంగారం, 1116 కేజీల వెండి.. జయలలిత ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ

Jayalalithaa: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో స్వాధీనం చేసుకున్న మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన అన్ని ఆభరణాలు, భూమి పత్రాలను ఈ రోజు(శుక్రవారం) తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించారు. తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించిన ఆస్తులలో 27 కిలోల బంగారం, 1116 కిలోల వెండి, భూమి పత్రాలు ఉన్నాయి. జయలలిత నుంచి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో స్వాధీనం చేసుకున్న ఆస్తులను దర్యాప్తు సమయంలో కర్ణాటక శాసనసభ ఖజానాలో భద్రపరిచారు. ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వం వద్ద ఉన్న జయలలిత ఆభరణాలు, ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని కోరుతూ బెంగళూరులోని ప్రత్యేక కోర్టులో కేసు దాఖలైంది. ఈ కేసులో కర్ణాటక ప్రభుత్వానికి చట్టపరమైన ఖర్చులుగా రూ.5కోట్లు చెల్లించిన తర్వాత ఆభరణాలను తిరిగి తీసుకోవచ్చని కోర్టు గత సంవత్సరం తీర్పు ఇచ్చింది.

దీపక్, దీపల కేసులు ఇలా..
ఇదిలా ఉండగా.. జయలలిత సోదరుడు జయకుమార్ కుమారుడు దీపక్, కుమార్తె దీప ఆ ఆస్తులు తమవేనని కర్ణాటక హైకోర్టులో కేసు వేశారు. ఫలితంగా బెంగళూరు ప్రత్యేక కోర్టు ఆదేశంపై మధ్యంతర స్టే విధించబడింది. ఈ కేసు హైకోర్టు విచారణలో ఉండగా.. జనవరి 13న కర్ణాటక హైకోర్టు దీపక్, దీపల పిటిషన్లను తిరస్కరించింది. అనంతరం జనవరి 29న బెంగళూరు ప్రత్యేక కోర్టు జయలలితకు చెందిన అన్ని ఆభరణాలు, భూమి పత్రాలు, ఇతర వస్తువులను ఫిబ్రవరి 14, 15 తేదీల్లో తమిళనాడు అవినీతి నిరోధక శాఖకు అప్పగించాలని ఆదేశించింది. జస్టిస్ మోహన్ తన తీర్పులో.. "తమిళనాడు ప్రభుత్వం తగిన పోలీసు రక్షణతో వచ్చి ఆభరణాలతో నిండిన ఇనుప పెట్టెను తీసుకువెళ్లాలి."అని ఆదేశించారు.

Jayalalithaa s Assets Transferred to Tamil Nadu Government Gold Silver and Property Documents

కట్టుదిట్టమైన భద్రత, వీడియోగ్రఫీ
ఈ క్రమంలో ఆస్తులను కోర్టు, ప్రభుత్వ అధికారుల సమక్షంలో తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించారు. ఈ విలువైన వస్తువులను స్వీకరించడానికి తమిళనాడు హోంశాఖ సంయుక్త కార్యదర్శి కోర్టుకు హాజరయ్యారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ట్రెజరీ అధికారులు ఆస్తులను జాగ్రత్తగా అప్పగించారు. ఆ ఆస్తులకు సంబంధించిన రికార్డులను నమోదు చేసే మొత్తం ప్రక్రియను తమిళనాడు అధికారులు వీడియో రికార్ఢింగ్ చేశారు. ఈ మొత్తం ప్రక్రియ ఒక మూసి ఉన్న గదిలో జరిగింది. చట్టపరమైన విధానాలను అనుసరించి విలువైన వస్తువులను అధికారికంగా తమిళనాడు అధికారులకు అప్పగించారు.

దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్న జయలలిత ఆస్తులు ఇవే..
*బంగారం-27 కిలోల 558 గ్రాముల ఆభరణాలు
*వెండి-1116 కిలోలు
*1526 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలు

కేసు వివరాలు ఇలా..
మాజీ ముఖ్యమంత్రి జయలలిత దీర్ఘకాలిక అనారోగ్యంతో 2016 డిసెంబర్ 5న మరణించారు. జయలలిత తొలిసారి ముఖ్యమంత్రిగా ఉన్న 1991-1996 కాలంలో ఆమెపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదైందనే సంగతి తెలిసిందే. ఆమె ఆదాయానికి మించి సంపదను కూడబెట్టారని ఆరోపణలు వచ్చాయి. ఆమె అప్పట్లో దాదాపు రూ.67 కోట్ల విలువైన ఆస్తులను కూడబెట్టారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును అవినీతి నిరోధక చట్టం, 1988 కింద నమోదు చేశారు. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ), ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు చేశాయి. 2014 సెప్టెంబర్ 27న బెంగళూరులోని ప్రత్యేక కోర్టు జయలలితను దోషిగా నిర్ధారించి ఆమెకు నాలుగు సంవత్సరాల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించింది. ఆ నిర్ణయం తర్వాత ఆమె సీఎం పదవికి రాజీనామా చేసి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. కానీ మే 2015లో కర్ణాటక హైకోర్టు ఆమెను నిర్దోషిగా విడుదల చేసింది. ఆ తర్వాత ఆమె మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+