JEE Main 2021కు ప్రిపేర్ అవుతున్నారా? కీలక ప్రకటన చేసిన టెస్టింగ్ ఏజెన్సీ

న్యూఢిల్లీ: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్‌కు సిద్ధపడుతోన్న లక్షలాది మంది అభ్యర్థుల కోసం కీలక ప్రకటన వెలువడింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో జేఈఈ మెయిన్ 2021కు సంబంధించిన ఏప్రిల్ సెషల్ ఉంటుందా? ఉండదా? అనే సందేహాలు అభ్యర్థుల్లో వ్యక్తమౌతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ (CBSE) నిర్వహించదలిచిన 10వ తరగతి పరీక్షలను రద్దు చేయడం, 12వ క్లాస్ ఎగ్జామ్స్‌ను వాయిదా వేసిన పరిస్థితుల్లో జేఈఈ మెయిన్ ఏప్రిల్ సెషన్స్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి.

దీనిపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కొద్దిసేపటి కిందటే ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. జేఈఈ మెయిన్ 2021 ఏప్రిల్ సెషల్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం.. జేఈఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ ఈ నెల 27,28,30 తేదీల్లో నిర్వహించాల్సి ఉంది. దాన్ని వాయిదా వేసినట్లు తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్టీఏ స్పష్టం చేసింది. ఈ మూడు రోజుల సెషన్‌ను ఎప్పుడు నిర్వహించాలనే విషయాన్ని తరువాత వెల్లడిస్తామని పేర్కొంది. పరీక్షలు ప్రారంభం కావడానికి కనీసం 15 రోజుల ముందు ఆ సెషన్ల తేదీలను ప్రకటిస్తామని తెలిపింది.

JEE Main 2021 April session has been postponed by National Testing Agency

Recommended Video

    WHO Chief Calls Growth In Covid-19 Cases ''worrying'' | Oneindia Telugu

    జేఈఈ మెయిన్ పరీక్షలకు సంబంధించి రెండు నెలల సెషన్ ఇదివరకే ముగిసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 23, 24, 25, 26 తేదీల్లో మొదటి సెషన్ పూర్తయింది. కిందటి నెల 16,17,18 తేదీల్లో రెండో సెషన్ ముగిసింది. మూడో సెషన్ ఈ నెల చివర్లో ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ.. కరోనా వైరస్ విస్తరిస్తోన్నందు వల్ల వాయిదా వేసినట్లు ఎన్టీఏ వివరించింది. అభ్యర్థులు పరీక్షలకు సిద్ధం కావడానికి అవసరమైన మెటీరియల్‌ ఎన్టీఏ యాప్ NTA Abhyas Appలో అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. ఫుల్ లెంగ్త్/చాఫ్టర్ వారీగా టెస్ట్ ప్రాక్టీస్ పేపర్లు ఆ యాప్‌లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+