వైరల్ వీడియో: అసెంబ్లీలో అవేం పనులు మినిస్టర్ గారు..!

చెప్పేవి శ్రీరంగనీతులు..చేసేవి గలీజు పనులు. ఇదేంటి ఈ సామెత ఇప్పుడెందుకు అనుకుంటున్నారా... అక్కడికే వస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్, శుభ్రత పరిశుభ్రతపై ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతుంటే.. అదే ప్రభుత్వంలోని పెద్దలు మాత్రం వాటిని పక్కనపెడుతున్నట్లు కనిపిస్తోంది. సరే... సాధారణ మనుషులు పాటించడం లేదంటే ఏదో అనుకోవచ్చు.. సాక్ష్యాత్తు మంత్రులే పరిశుభ్రతను మరిచి గలీజు పనులు చేస్తుంటే సామాన్యులు షాక్ అయ్యే పరిస్థితి వస్తోంది. ఇదే సీన్ రాజస్థాన్ రాష్ట్ర అసెంబ్లీ పరిసరాల్లో జరిగింది. ఇంతకీ ఏం జరిగింది.. ఏమా కథ తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

రాజస్థాన్ పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రి ఝబర్ సింగ్ ఖర్రా వివాదంలో చిక్కుకున్నారు. శాసనసభ జరుగుతున్న వేళ హౌజ్‌లో ఆయన ఉమ్మివేయడం కెమెరా కంటికి చిక్కింది.ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇస్తుండగా జరిగిన ఈ ఘటన, సభలో ప్రజాప్రతినిధుల ప్రవర్తన, నైతికతపై తీవ్ర చర్చకు దారితీసింది.మంత్రి మాట్లాడుతుండగా ఆయన నోట్లోకి ఏదో ప్రవేశించినట్లు వీడియోలో కనిపించింది.దీంతో ప్రసంగం మధ్యలో ఆపి అక్కడే ఉమ్మివేశారు.ఆయన ఉమ్మి వేసే దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. దీంతో సభలో గందరగోళం నెలకొంది.ఈ సంఘటన పెద్ద రాజకీయ దుమారాన్ని రేపగా, ప్రతిపక్ష సభ్యులు దీనిని అసెంబ్లీ గౌరవానికి భంగమని అభివర్ణించారు.మంత్రిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Jhabar Singh Kharra Viral Video Shows Rajasthan Minister Spitting Inside the Assembly Hall

సభ నిబంధనల ప్రకారం ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ అంశంపై చట్టసభ ఉన్నతాధికారులు సమగ్రంగా సమీక్ష నిర్వహించి,తదుపరిగా తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సభ గౌరవం, ప్రజాస్వామ్య విలువలను కాపాడే దిశగా తగిన చర్యలు చేపట్టాలని అభిప్రాయపడుతున్నాయి.

అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు హరలాల్ సింగ్ ఖర్రా కుమారుడైన, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు ఝబర్ సింగ్ ఖర్రా, రాజస్థాన్‌లోని శ్రీమాధోపూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన 2013-2018 మధ్య ఎమ్మెల్యేగా, తిరిగి 2023లో అదే నియోజకవర్గం నుండి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+