జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘర్షణ: జేవీఎం ఎమ్మేల్యే అరెస్టు
న్యూఢిల్లీ: జార్ఖండ్‌లో జరుగుతున్న మూడో దశ ఎన్నికల్లో ఘర్షణ చోటుచేసుకుంది. ఇఛాగఢ్ నియోజకవర్గ పరిధిలో జరిగిన ఈ ఘర్షణల నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, జార్ఖండ్ ముక్తి మోర్చా (ప్రజాతంత్రిక్) పార్టీ నేత అరవింద్ కుమార్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలింగ్ కేంద్రానికి సమీపంలో బీజేపీ, అరవింద్ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో బీజేపీ అభ్యర్థి సాదు చరణ్ మెహతోతో పాటు మరో ఇద్దరు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో అరవింద్ కుమార్ సింగ్‌పై పోలీసులకు బీజేపీ ఫిర్యాదు చేసింది.
దీంతో అరవింద్ కుమార్ సింగ్‌తో పాటు ఆయన అనుచరవర్గంలోని 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు డీఐజీ నీహాల్ వెల్లడించారు. టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, ఆయన భార్య సాక్షి జార్ఖండ్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మరోవైపు మధ్యాహ్నాం 12 గంటల సమయానికి జార్ఖండ్‌లోని 17 నియోజక వర్గాల్లో 18.34 శాతం, జమ్మూ కాశ్మీర్‌లోని 16 నియోజక వర్గాల్లో సుమారు 14 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లోని 1781 పోలింగ్ కేంద్రాల ద్వారా 13,69,579 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కాశ్మీర్ లోయలో శుక్రవారం జరిగిన ఘటనలో 11 మంది భద్రతా సిబ్బంది సహా 21 మంది చనిపోవడంతో ఎన్నికలు జరిగే బారాముల్లా, బద్ గాం, పుల్వామా జిల్లాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జార్ఖండ్‌లోని హతియాలో రికార్డు స్ధాయిలో 29 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. ఇక జార్ఖండ్‌లోని కెందువా పహారీ ప్రాంతంలో నక్సలైట్లు, భద్రత దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications