ఎన్డీఏ, ఇండియా కూటములకు చమటలు పట్టిస్తున్న జైరామ్ మహతో!

రాంచీ: వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న జార్ఖండ్ రాష్ట్రంలో అధికారాన్ని తిరిగి దక్కించుకునేందుకు ఇండియా కూటమి, ఈసారి అధికారంలోకి రావాలని ఎన్డీఏ కూటమి నేతలు విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అధికారం తమదేనంటూ ఈ రెండు కూటముల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ రెండు కూటములకు గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధమైంది మరో పార్టీ.

అదే జైరామ్ మహతో నాయకత్వంలోని జార్ఖండ్ లోక్‌తాంత్రిక్ క్రాంతికారి మోర్చా (JKLM). ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈ పార్టీ హేమంత్ సోరెన్ నాయకత్వంలోని జేఎంఎం, ప్రతిపక్ష బీజేపీ పార్టీలకు రాష్ట్రంలో గట్టి పోటీనిచ్చింది. ఈ నేపథ్యంలో జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీలకు చటమటలు పట్టించే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Jharkhand Elections JKLM chief Jairam Mahato is fighting hard for NDA and India alliances

జైరామ్ మహతో నాయకత్వంలోని జేకేఎల్ఎం పార్టీకి కుల సమీకరణలు కూడా సానుకూలంగా మారనున్నట్లు తెలుస్తోంది. జైరామ్ కుర్మీ కుర్మి కులానికి చెందినవారు. రాష్ట్రంలోని కుర్మి కుల జనాభా 15 శాతానికి మించి ఉండటం గమనార్హం. 26.2 శాతం ఉన్న గిరిజనుల తర్వాత వీరి ప్రభావమే ఎక్కువ.

గిరిడి లోక్‌సభ స్థానంలో ఓడిపోయినప్పటికీ.. జార్ఖండ్ రాజకీయాల్లో మహతో తనను తాను ఎదుగుతున్న స్టార్‌గా నిరూపించుకున్నారు. జైరాం మహతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 3 లక్షల 47 వేల 322 ఓట్లు సాధించడం గమనార్హం. జార్ఖండ్ రాజకీయాల్లో జైరామ్ మహతో ఎదుగుదల AJSU, JMM లకు ప్రమాద ఘంటికలు పెంచింది. ఇప్పటి వరకు, ఈ రెండు పార్టీలు స్థానిక ఓట్లపై నియంత్రణ కలిగి ఉన్నాయి. కానీ ఇప్పుడు జార్ఖండ్‌లో జైరామ్ మహతో రూపంలో మూడవ బలమైన పార్టీ వచ్చింది.

వాస్తవానికి, గిరిడిహ్ సీటు ఎన్డీఏ కూటమిలోని ఆజ్సు పార్టీకి దక్కింది. ఇండియా కూటమి కింద JMM ఈ స్థానాన్ని పొందింది. అటువంటి పరిస్థితిలో, జైరామ్ మహతోకి వచ్చిన బంపర్ ఓట్లు ఎన్డీఏ, ఇండియా కూటమికి కూడా ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయనే చెప్పాలి. జార్ఖండ్ లోక్‌తాంత్రిక్ క్రాంతికారీ మోర్చా (జేఎల్‌కేఎం) అధినేత జైరామ్ మహతో డుమ్రీ సీటుతో సహా రెండు చోట్ల పోటీ చేసే అవకాశం ఉంది. JLKM మొత్తం 71 స్థానాల్లో ఎన్నికల్లో పోటీ చేయనుంది.

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో గిరిదిహ్, ధన్‌బాద్, హజారీబాగ్, రాంచీ, కోడెర్మా స్థానాల్లో బలమైన ఉనికిని నమోదు చేయడం ద్వారా జైరామ్ మహతో తాను పెద్ద ప్రభావశీలతి కాబోతున్నానని నిరూపించారు. ముఖ్యంగా కుర్మీ మెజారిటీ సీట్లపై జైరాం ఫ్యాక్టర్ పని చేస్తుంది. లోక్‌సభ ఎన్నికల పనితీరును బట్టి చూస్తే, జైరాం ఈ కొత్త రాజకీయ ఎదుగుదల రాష్ట్రంలోని కీలక పార్టీలు JMM, BJP మధ్య ఖచ్చితంగా కలవరం పెంచినట్లు కనిపిస్తోంది.

జైరామ్ మహతో ఎవరు?

జైరాం మహతో జార్ఖండ్‌లోక్తాంత్రిక్ క్రాంతికారీ మోర్చా(JLKM) అధిపతి. ఆయన 2024 లోక్‌సభకు గిరిడిహ్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు.
మహతో 27 డిసెంబర్ 1994న ధన్‌బాద్ జిల్లాలోని మాంటాండ్ గ్రామంలో జన్మించారు. అతను ధన్‌బాద్‌లోని కోయలాంచల్ విశ్వవిద్యాలయం నుంచి తన బ్యాచిలర్ డిగ్రీని పొందారు.

జైరాం మహతో గత నాలుగేళ్లుగా భాష, నివాసం, ఉద్యోగ సమస్యలపై ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన 1932లో ఖతియాన్ ఆధారంగా జార్ఖండ్, నివాసం పోటీ పరీక్షలలో స్థానిక భాషలకు సంబంధించిన ఉద్యమానికి నిరంతరం నాయకత్వం వహిస్తున్నారు. జైరామ్ మహతో జూన్ 2023లో జార్ఖండి భాషా ఖతియాన్ సంఘర్ష్ సమితి (JBKSS) పేరుతో పార్టీని స్థాపించారు. ప్రస్తుతం జేకేఎల్ఎం పార్టీతో కొనసాగుతున్నారు. కాగా, జార్ఖండ్ రాష్ట్రంలో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 13, నవంబర్ 20 తేదీల్లో ఎన్నికలు జరగనుండగా.. నవంబర్ 23న ఎన్నికల ఫలితాలు వెలువనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+