కాలేజీ ఎదుటే చేతులు నరికి విద్యార్థిని దారుణ హత్య
రామ్‌గఢ్: జార్ఖండ్ రాష్ట్రంలోని రామ్‌గఢ్ ప్రాంతంలో బుధవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. తాను చదువుతున్న కళాశాల ఎదురుగానే 30ఏళ్ల బీఈడీ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. చేతులు నరికేసి దుండగులు, ఆమె తలపై మోది హత్య చేశారు.
వివరాల్లోకి వెళితే.. వివాహిత అయిన సోనాలి మర్మ్(30) రామ్‌గఢ్‌లోని ఓ కాలేజీలో బీఈడీ చదువుతోంది. కాగా, ఆమెను ప్రేమిస్తున్నానంటూ సుకేన్ మండల్ అనే వ్యక్తి తరచూ వేధింపులకు గురిచేసేవాడు. ఆమెకు పెళ్లైనా కానీ అతడు వెంటపడటం మానలేదు.

అతని ప్రేమను అంగీకరించకపోవడంతో సోనాలీపై మండల్ కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే సుకేన్ మండల్.. సోనాలిని హత్య చేసి వుంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
దుమ్కా ప్రాంతానికి చెందిన నిందితుడు సుకేన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. రోజూ సోనాలిని భర్త తన బైక్‌పై కాలేజీ వద్ద దిగబెట్టి వచ్చేవాడని, కానీ, బుధవారం సోదరుడి బండి మీద ఆమె కాలేజీ వెళ్లిందని సోనాలి కుటుంబసభ్యులు తెలిపారు. అతడు కాలేజీ నుంచి తిరిగొచ్చేలోపే ఈ దారుణం జరిగిపోయిందని రోదించారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications