గుట్కా మాయ: రూ. 10 కోసం యువకుడి హత్య

Just for Rs 10, a man is killed in Bihar
పాట్నా‌‌: పది రూపాయలు ఇవ్వనందుకు బీహార్‌లో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. గుట్కా కొనుక్కోవడానికి పది రూపాయలు ఇవ్వడానికి నిరాకరించడంతో ఆ యువకుడిని చంపినట్లు పోలీసులు బుధవారంనాడు చెప్పారు.

ఇరవై ఏళ్ల వయస్సు గల దీపక్ కుమార్ యాదవ్‌ను మంగళవారం రాత్రి జిల్లా కేంద్రం కతిహార్‌లో నలుగురు వ్యక్తులు హత్య చేశారు. గుట్కా కొనుక్కోవడానికి వారు పది రూపాయలు అడిగారు. అతను అందుకు నిరాకరించాడు. దీంతో అతన్ని చంపేశారు.

కేసు నమోదు చేసినట్లు కతిహార్ పోలీసు సూపరింటిండెంట్ అస్ఘర్ ఇమామ్ చెప్పారు. కేవలం పది రూపాయల కోసం వ్యక్తి హత్య చేయడం ఆశ్చర్యకరంగా ఉందని ఆయన అన్నారు.

ఈ సంఘటన స్థానికులను తీవ్ర భయభ్రాంతులకు, దిగ్భ్రాంతికి గురి చేసింది. దాడి చేసినవారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+