Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌..

భారతదేశం అత్యున్నత న్యాయస్థానం.. సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ఫిక్స్ అయ్యారు. ఈ మేరకు ఆయన పేరును కొలీజియం సిఫార్సు చేసింది. ఈ ఏడాది నవంబర్ 24 వరకు గవాయ్ సీజేఐగా బాధ్యతలు నిర్వహించనున్నారు.కొలీజియం సిఫార్సులను కేంద్రం ఆమోదిస్తే 52వ భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్‌ గవాయ్‌ నియమితులు కానున్నారు.

గవాయ్‌ పూర్తిపేరు భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌. ఆయన 1960 నవంబర్‌ 24న అమ్రావతిలో జన్మించారు. 1985 మార్చి 16న బార్‌లో సభ్యుడిగా చేరారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 13 పదవీ విరమణ చేయనున్నారు.

justice-br-gavai-to-be-the-next-chief-justice-of-the-supreme-court

జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రస్థానం..

జస్టిస్ సంజీవ్ ఖన్నా 1983లో ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుని తన న్యాయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. తొలుత తీస్ హజారీ కోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించిన ఆయన, ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా కొనసాగారు. 2004లో ఇన్‌కమ్ టాక్స్ విభాగానికి సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. అలాగే ఢిల్లీ హైకోర్టులో ఎమికస్ క్యూరీగా (కోర్టుకు సలహాలు ఇచ్చే న్యాయ నిపుణుడు) మరియు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

2005లో ఆయన ఢిల్లీ హైకోర్టు అడిషనల్ జడ్జిగా నియమితులయ్యారు. ఏడాది తరువాత, 2006లో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆయన ఢిల్లీ జ్యుడీషియల్ అకాడమీ ఛైర్మన్‌గా, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఇన్‌ఛార్జిగా కూడా సేవలందించారు. 2019 జనవరి 18న జస్టిస్ సంజీవ్ ఖన్నా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ప్రత్యేకంగా గమనించదగిన విషయం ఏమిటంటే - ఆయన ఏ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయకుండానే నేరుగా సుప్రీంకోర్టుకు చేరుకున్న అరుదైన న్యాయమూర్తులలో ఒకరు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+