భారత 45వ చీఫ్ జస్టిస్ గా దీపక్ మిశ్రా ప్రమాణ స్వీకారం
45 వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గా జస్టిస్ దీపక్ మిశ్రా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు.
న్యూఢిల్లీ: 45 వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గా జస్టిస్ దీపక్ మిశ్రా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు.
దీపక్ మిశ్రాతో రాష్ట్రపతి కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఇదివరకు 44 వ సీజేఐగా జస్టిస్ జగదీశ్ సింగ్ ఖెహర్ ఉన్నారు. మిశ్రా 1977 లో లాయర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు.

1996 లో ఒరిస్సా హైకోర్ట్ అడిషనల్ జడ్జి గా ఆయనను నియమించారు. ఆ తర్వాత మధ్య ప్రదేశ్ లో పని చేశారు. 2009 లో పాట్నా హైకోర్టు కు చీఫ్ జస్టిస్ గా పని చేశారు. 2010 లో ఢిల్లీ హైకోర్టు కు చీఫ్ జస్టిస్ గా పనిచేశారు. 2011 లో సుప్రీం కోర్టు లో అపాయింట్ అయ్యారు మిశ్రా.












Click it and Unblock the Notifications