శబరిమలలో అయ్యప్ప భక్తులకు ఏం చేస్తున్నారు ?, డబ్బు వసూలు చేసి ?, అన్నామలై !

శబరిమల అయ్యప్పస్వామి భక్తల యాత్రలో అయ్యప్ప భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై తమిళనాడు బీజేపీ చీఫ్, మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై మండిపడ్డారు. కేరళ ప్రభుత్వం అయ్యప్ప భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని అన్నామలై ఆరోపించారు. కేరళ ప్రభుత్వం పనితీరు లోపించిందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఆరోపించారు.

శబరిమల ఆలయ దర్శన సమయంలో అయ్యప్ప భక్తులకు భోజనం, నీరు లేకుండా గంటల తరబడి క్యూలో నిలబడేలా కేరళ ప్రభుత్వం చేసిందని అన్నామలై మండిపడ్డారు. తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి అయ్యప్ప భక్తులు ప్రతి సంవత్సరం శబరిమలను సందర్శిస్తుంటారని అన్నామలై గుర్తు చేశారు. అయితే అయ్యప్ప భక్తల అవసరాలు తీర్చే విషఫయంలో కేరళ ప్రభుత్వం సరైన జాగ్రత్తలు తీసుకోలేదని అన్నామలై విమర్శించారు.

 K Annamalai accused Kerala of failing to provide minimum facilities to Ayyappa devotees at Sabarimala

కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం నిద్ర మత్తులో ఉందని, అయ్యప్ప భక్తులు ఏ ఇబ్బందులు పడితే మాకెందుకులే అని నిర్లక్షం చేస్తున్నారని, కేరళ ప్రభుత్వం తీరు రోజురోజుకు అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అయ్యప్ప భక్తులను గంటల తరబడి క్యూలో నిల్చోబెట్టి భోజనం, నీరు లేకుండా చేస్తున్నారని అన్నామలై విమర్శించారు.

అయ్యప్ప భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించాలని అన్నామలై కేరళ ప్రభుత్వానికి మనవి చేశారు. ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ జోక్యం చేసుకోవాలని, కేరళ ప్రభుత్వంతో స్టాలిన్ చర్చలు జరపాలని అన్నామలై డిమాండ్ చేశారు. శబరిమలలో రద్దీలో చిక్కుకున్న భక్తులలో ఎక్కువ మంది తమిళనాడుకు చెందినవారేనని, వారి భద్రతకు చర్యలు తీసుకోవాలని సీఎం స్టాలిన్‌ను కోరుతున్నామని అన్నామలై తెలిపారు. అయ్యప్ప భక్తులు పదే పదే ఎదుర్కొంటున్న సమస్యలను కేరళ బీజేపీ చీఫ్ సురేంద్రన్ కేరళ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

 K Annamalai accused Kerala of failing to provide minimum facilities to Ayyappa devotees at Sabarimala

పినరయి విజయన్ పాలనలో, శబరిమల నిర్వహణ లోపం, నియంత్రణ అత్యంత తారా స్థాయికి చేరుకుందని, అయ్యప్ప భక్తులు పంపా నుండి శబరిమలలోని అయ్యప్ప సన్నిధానం వరకు 18 గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోందని, ఆపై రహదారిపై మరో 10-12 గంటలు పడుతోందని, అయ్యప్ప దర్శనానికి 26 నుంచి 30 గంటలకు పైగా పడుతోందని, మరుగుదొడ్లు, ఆహారం, నీటి సరఫరా లేకపోవడంతో అయ్యప్ప భక్తులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అయ్యప్ప భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించలేని కేరళ ప్రభుత్వం భక్తుల నుండి డబ్బు వసూలు చేయడంపై ఎక్కువ దృష్టి పెడుతుందని కేరళ బీజేపీ చీఫ్ సురేంద్రన్ ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+