టి బిల్లు రావాల్సిందే కానీ: కమల్ ట్విస్ట్, బిజెపి సస్పెన్స్

లోకసభ వ్యవహారాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు పెట్టారు. లోకసభలో బిల్లును పెట్టేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుండి అనుమతి వచ్చిందని లోకసభ సచివాలయ కార్యాలయం తెలిపింది.
గట్టి భద్రత
తెలంగాణ ముసాయిదా బిల్లును పార్లమెంటులో పెట్టనున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు ఫైరింజన్లు కూడా ఏర్పాటు చేశారు. ఎపికి చెందిన వారికి పాసులు నిరాకరించడమే కాకుండా పార్లమెంటు సభ్యులను కూడా క్షుణ్ణంగా పరిశీలించి లోపలకు పంపిస్తున్నారు. ప్లకార్డులు కూడా లోపలకు అనుమతించడం లేదు.
బిజెపిపై ఉత్కంఠ
తెలంగాణ ముసాయిదా బిల్లును లోకసభలో ప్రవేశ పెడితే భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణకు తాము అనుకూలమని బిజెపి మొదటి నుండి చెబుతోంది. అయితే, కొద్ది రోజులుగా సీమాంధ్ర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తోంది. సీమాంధ్రుల సమస్యలకు పరిష్కారం చూపితే తాము బిల్లుకు మద్దతిస్తామని బిజెపి చెప్పినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications