ట్రంప్‌ ను మించిన వ్యక్తి ఆయన.. కంగనా సంచలన ట్వీట్ .. వెంటనే డిలీట్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్ సంచలన ట్వీట్ చేశారు. భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుపై దేశ వ్యాప్తంగా ఆయనపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భారత్- పాక్ మధ్య కాల్పుల విరమణ అవగాహనను తానే కుదిర్చానని ట్రంప్ ప్రపంచ దేశాలకు చెప్పుకుంటున్నారు.

పాకిస్థాన్ ను భారత్ తో పోల్చుతూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. రెండు దేశాలూ పవర్ ఫుల్.. అనీ కాల్పులు ఆపితే తాము ఇరు దేశాలతో వాణిజ్యం చేస్తామని.. ఇరు దేశాల ప్రధానులతో తనకు సాన్నిహిత్యం ఉందని ట్రంప్ ఇటీవల చెప్పుకొచ్చారు. అయితే ఆయన వ్యాఖ్యలపై భారతీయులు ఆగ్రహంతో ఉన్నారు.

Kangana Ranaut Deletes Tweet Comparing PM Modi to Donald Trump

తాజాగా మరోసారి భారత్ పై తన వైఖరిని ప్రదర్శించారు ట్రంప్. యాపిల్‌ తయారీ ప్లాంట్లను భారత్‌కు తరలించొద్దని ఆ కంపెనీ సీఈఓ టిమ్‌ కుక్‌ కు తానే సూచించానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బాంబ్ పేల్చారు. దీంతో ఆయనపై భారత్ లోని ప్రజలు మండిపడుతున్నారు. భారత్ నోటి కాడి యాపిల్ ట్రంప్ లాగేసుకున్నారని అటు సోషల్ మీడియాలోనూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. అయితే తాజాగా ఇదే వ్యవహారంపై బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు.

"ట్రంప్‌ వ్యవహార శైలికి కారణం ఏమో తెలియదు. ఆయన అమెరికాకు అధ్యక్షుడు కావచ్చు. కానీ, ప్రపంచంలో అత్యంత ప్రియమైన నేత భారత ప్రధాని మోదీనే. అధ్యక్షుడిగా ట్రంప్‌ కు ఇది రెండో టర్మ్. కానీ, భారత ప్రధానికి మూడోది. ట్రంప్‌ కు మించిన వ్యక్తి మోదీ. వ్యక్తిగత అసూయతో, దౌత్య పరమైన అభద్రతాభావంతో ఇలాంటి పనులు చేస్తున్నారా? అని కంగనా రనౌత్‌ సంచలన పోస్టు చేసింది. అయితే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. సూచనల మేరకు ఆ ట్వీట్‌ డిలీట్‌ చేశానంటూ ఆమె మరో ట్వీట్‌ చేశారు. దీంతో ఆమె వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ఇటీవల ఖతార్ లో జరిగిన ఓ వాణిజ్య మీటింగ్ లో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన వెంట యాపిల్ సీఈఓ టిమ్ కుక్ కూడా ఉన్నారు. నాకు టిమ్‌ కుక్‌తో చిన్న సమస్య ఉంది. ఆయన భారత్‌లో యాపిల్ ప్లాంట్స్ పెట్టాలని అనుకున్నారు. కానీ అలా చేయడం నాకు ఇష్టం లేదని చెప్పాను. భారత్ లో టారిఫ్ లు అధికం. అమెరికాలో ఉత్పత్తి పెంచండి. అని ట్రంప్ పేర్కొనడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+