పక్కరాష్ట్రంలో దుమ్ములేపిన మగాళ్లు, గాడిద మీద ఊరేగింపులు, పేడతో వాంచుడు, ఏం జరిగింది ?
కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా సరిహద్దులోని తమిళనాడు రాష్ట్రం గుమటాపూర్ గ్రామంలో గోరె పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ పండుగ ప్రత్యేకత ఏమిటంటే గ్రామస్తులు పేడ కుప్పను తయారు చేసి అందులో ఊరేగుతారు. ఊరు మొత్తం కన్నడిగులు నివసించే తమిళనాడులోని తలవాడి తాలూకాలోని గుమటాపూర్‌లో ప్రతి సంవత్సరం బలిపాడ్యమి తరువాత గోరె పండుగను జరుపుకుంటారు.
అదేవిధంగా ఈ ఏడాది కూడా గోరె పండుగను సంప్రదాయం ప్రకారం జరుపుకుంటారు. ఈ పండుగ ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. పండుగ రోజు ఉదయం గ్రామంలోని అన్ని ఇళ్లలోని కొట్టాల నుంచి ఎద్దుల బండ్లు, ట్రాక్టర్ల ద్వారా పేడను తీసుకొచ్చి గ్రామంలోని బీరేశ్వర ఆలయం దగ్గర కుప్పలు వేస్తారు. ఆ తర్వాత గ్రామంలోని వాగు ఒడ్డుకు వెళ్లి ఇద్దరు వ్యక్తులకు గడ్డిని మీసాలు, గడ్డాలు కట్టి వారి నుదుటిపై నామాలను ఉంచి గాడిదలపై ఊరంతా ఊరేగిస్తారు.

అలా గాడిదలపై ఎక్కి ఊరేగించే వారిని కొండకరులు అంటారు. కొండకరలు అంటే తెలుగులో అబద్దాలు చెప్పేవాడు, మోసగాడు అని అర్దం. గతంలో మాయమాటలు చెప్పి గ్రామంలోని ప్రజల్లో ద్వేషం, అసూయలు సృష్టించి అశాంతి కలిగించేవారున్నారు గ్రామస్తులు అంటున్నారు. అలాంటి వారిని ఏవిధంగా శిక్షించారనేదానికి ప్రతీకగా వీరిద్దరినీ చాడికోర్లు వేసుకుని గాడిదలపై ఊరేగించారు.
అనంతరం ఊరి ప్రజలు పేడ కుప్ప దగ్గర గుమిగూడారు. అప్పుడు ఒంటి పోరు మొదలవుతుంది. పేడ కుప్పల్లో దొర్లిన గ్రామస్తులు ఒంటిలోనే పోట్లాడుకుంటున్నారు. పేడ పెద్ద పెద్ద ముద్దలు చేసి ఒకరికొకరు పేడ ముద్దలు ఎత్తుకుని సరదాగా విసేరిసుకుంటూ గడిపారు. పెద్దపెద్ద పేడ ముద్దలు ఒకరిమీద ఒకరు విసురుకున్నారు.
పేడలతో ఒకరిని ఒకరు కొట్టుకోవడం వింటే నవ్వు వస్తుంది. అయితే ఇది వారి ఆచారం. పండుగ రోజు పేడతో శరీరం అంతా రుద్దుకుంటే చర్మవ్యాదులు రావని, ఇది పెద్దలు పెట్టిన ఆచారం అని ఆ ఊరి గ్రామస్తులు అంటున్నారు. తమిళనాడులో గ్రామం మొత్తం కన్నడిగులు నివాసం ఉండే ప్రాంతంలో జరిగిన పండుగకు చామరాజనగర జిల్లా, మైసూరు జిల్లాల్లోని వారి బంధువులు పెద్ద సంఖ్యలో వెళ్లారు,












Click it and Unblock the Notifications