మోడీని 'రాష్ట్రపతి' అన్న కరిష్మా, ట్విట్టర్‌లో వ్యంగ్యాస్త్రాలు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీని రాష్ట్రపతిగా అభివర్ణించింది ఓ సెలబ్రిటీ. ప్రధాని మోడీ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఓ సెలబ్రటీ నరేంద్ర మోడీని తప్పుగా అభివర్ణించడంతో ఇప్పుడు దానిపై సామాజిక అనుసందాన వెబ్ సైట్లలో జోకులు కూడా పేలుతున్నాయి.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నిర్వహిస్తున్న బిగ్ బాస్ 8వ సీజన్‌లో పాల్గొంటున్న బాలీవుడ్ నటి కరిష్మా తన్నా.. మోడీని ప్రెసిడెంట్ అఫ్ ఇండియా అని ప్రేక్షకుల నుంచి విమర్శలను ఎదుర్కొంది. అంతే కాదు '5 X 5 X 0' ఎంత అని అడిగితే కూడా సరైన సమాధానం చెప్పలేదు.
దానికి ఆమె 25 అని సమాధానం చెప్పింది. అంతేకాదు నేను చాలా షా అని సమాధానం ఇచ్చిందట. వీటిపై ట్విట్టర్ వేదికగా జోకులు పేలుస్తూ నవ్వుకుంటున్నారు.
కాగా, బిగ్ బాస్ వంటి పలు రియాలిటీ టీవీ షోల కంటెంట్ విషయంలో రాజ్యసభలో మంగళవారం విమర్శలు వెల్లువెత్తున విషయం తెలిసిందే. పలువురు సభ్యులు మాట్లాడుతూ... అటువంటి కార్యక్రమాలు అసభ్యంగా, అమర్యాదకరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కొన్నిసార్లు అమ్మాయిలు కురచ దుస్తులతో నృత్యం చేస్తున్న కార్యక్రమాలు కూడా ప్రసారమవుతున్నాయన్నారు. వెంటనే ఇందుకు సభలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయమంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ స్పందించారు. అలాంటి కార్యక్రమాలు ఛానళ్లలో వస్తున్నప్పుడు ఫిర్యాదు చేసేందుకు ఓ టెలిఫోన్ నంబర్ డిస్ ప్లే అవుతుందన్నారు.
కార్యక్రమాలలో ఏదైనా ఉల్లంఘన ఉంటే తప్పకుండా సదరు వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేవలం చూసేవారి ఫిర్యాదు ఆధారంగానే కాకుండా తాము పరిశీలన అనంతరం చర్యలు తీసుకుంటామని రాజ్యవర్దన్ సింగ్ రాథోడ్ చెప్పారు. ఫిర్యాదులను పరిశీలించేందుకు శాఖకు సొంతంగా ఓ సెల్ ఉందని చెప్పారు.
ప్రతి ఏడాది వేల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. గత ఏడాది 40వేల ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. అందులో 1500 కేసులు నమోదయ్యాయని చెప్పారు. చానళ్ల కార్యక్రమాల పైన పర్యవేక్షణలో భాగంగా ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ సెంటర్ 1500 టీవీ చానల్స్‌ను ఏకకాలంలో మానిటర్ చేస్తోందన్నారు.












Click it and Unblock the Notifications