Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉచిత బస్సు మహిళలకు మాత్రమే కాదు..!!

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సారథ్యంలో కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటివరకు మహిళలకు మాత్రమే పరిమితమైన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని మరింత విస్తరించింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకూ దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఓ ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్స్ ను తగ్గించడానికి, విద్యార్థులకు మరింత మెరుగైన రవాణా వసతి కల్పించడానికి, ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Karnataka announces Free Bus service for Government school students

ఈ ఉచిత బస్సు సౌకర్యం.. ఎల్ కే జీ నుంచి ప్రీ యూనివర్శిటీ కోర్స్ (పీయూసీ) అంటే ఇంటర్మీడియట్ వరకు వర్తిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలు, ఇంటర్మీడియట్ వరకు విద్యను బోధించే అన్ని ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునే విద్యార్థులు అందరికీ దీన్ని వర్తింపజేసింది.

ప్రస్తుతం కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలులో ఉంటోన్న విషయం తెలిసిందే. కేఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా ప్రయాణించవచ్చు. దీనికోసం సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెట్ లో 1,000 కోట్ల రూపాయల మేర కేటాయింపులు చేస్తోంది. అదే సమయంలో- కొత్త బస్సులను కొనుగోలు చేస్తోంది. కొత్త కొత్త రూట్లల్లోనూ బస్సులను నడిపిస్తోంది.

ఇప్పుడు తాజాగా విద్యార్థులకు కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనికి అవసరమైన మొత్తాన్ని వార్షిక బడ్జెట్ లో కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఈ ఉచిత బస్సు సౌకర్యం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 19 లక్షల మందికి విద్యార్థులకు లబ్ది కలుగుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+