పవన్ కళ్యాణ్ వచ్చినా ఏంకాదు, నా వద్ద కౌంటర్లు సిద్ధం: నటుడు సాయి కుమార్
బెంగళూరు: ప్రముఖ నటుడు సాయి కుమార్ కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన బాగేపల్లి నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎక్కువ మంది తెలుగు మాట్లాడుతారు. బాగేపల్లిలో కులప్రాబల్యం ఎక్కువ అంటుంటారు. పార్టీతో సంబంధం లేకుండా సామాజిక కోణంలో ఓట్లు ఎక్కువగా పడతాయంటున్నారు.
బాగేపల్లిలో బీజేపీ - కాంగ్రెస్ - జేడీఎస్ - సీపీఎంల మధ్య పోటీ ఉంది. బీజేపీ తరఫున సాయి కుమార్ ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు. కాంగ్రెస్ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే సుబ్బారెడ్డి, సీపీఎం నుంచి శ్రీరాం రెడ్డి, జేడీఎస్ నుంచి నిర్మాత మనోహర్ బరిలో నిలిచారు. మార్పుపై ఆశలు పెట్టుకొని నటుడు సాయి కుమార్ సాగుతున్నారు.

పవన్ కళ్యాణ్ ప్రచారంపై సాయి కుమార్ స్పందన
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారని తొలుత వార్తలు వచ్చాయి. జేడీఎస్ అధినేత కుమార స్వామి కూడా పవన్ తమ తరఫున ప్రచారం చేస్తారని వెల్లడించారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా పవన్ ప్రచారం నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది. అయితే పవన్ ప్రచారానికి వస్తారనే అంశంపై సాయి కుమార్ స్పందించారు.

పవన్ కళ్యాణ్‌కు నా వద్ద కౌంటర్లు
బాగేపల్లి నియోజకవర్గం నుంచి తన గెలుపు ఖాయమని సాయి కుమార్ అన్నారు. పవన్ కళ్యాణ్ వచ్చి ప్రచారం చేసినా
ఆయనకు ఇచ్చేందుకు తన వద్ద కౌంటర్లు సిద్ధంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. తెలుగువారు అధికంగా ఉండే బాగేపల్లి నియోజకవర్గంలో బీజేపీ ఘన విజయం సాధిస్తుందన్నారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. బాగేపల్లిలో మైనార్టీలు కూడా బీజేపీకే ఓటేస్తారన్నారు.

ఏ ఓటర్లు ఎంతమంది అంటే?
ఇదిలా ఉండగా, బాగేపల్లిలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు కులపరమైన ఓటర్లపై ఆశలు పెట్టుకోగా, సీపీఎం సంప్రదాయ ఓటర్లపై, బీజేపీ మార్పుపై ఆశలు పెట్టుకుందని అంటున్నారు. ఇక్కడ మొత్తం 1.92 లక్షలమంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 23 వేల మంది ముస్లింలు, 60 వేల మంది ఎస్సీ, ఎస్టీలు, రెడ్డి- గౌడలు 50 వేల మంది, బలిజలు 40 వేల మంది ఉన్నారు. ఇతర సామాజిక వర్గాల ఓటర్లు 22 వేల మంది దాకా ఉన్నారు.

ఇక్కడ గెలుపెవరిదో?
సాయికుమార్ 2008 ఎన్నికల్లో 26 వేల ఓట్లు సాధించారు. అప్పటి ఓట్లను కాపాడుకుంటూ ప్రస్తుతం తటస్థ, కొత్త ఓటర్లపై దృష్టి సారిస్తున్నారు. ఇక్కడి నుంచి గెలుపుపై తెలుగు ఓటర్లలోను ఆసక్తి నెలకొని ఉంది.
-
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ!












Click it and Unblock the Notifications