మీ నుండి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు: యోగికి కౌంటరిచ్చిన సిద్దూ
Recommended Video

బెంగుళూరు: మీ నుండి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాధ్‌పై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఎదురుదాడికి దిగారు.
కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీలో జరిగిన బిజెపి పరివర్తన యాత్రలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కర్ణాటక రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలపై సిద్దరామయ్య శుక్రవారం నాడు తీవ్రంగా స్పందించారు.

దేశంలో బీహర్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లోనే శాంతి భద్రతల పరిస్థితి బాగా లేదన్నారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య. అలాంటి మీ నుండి మేం పాఠాలను నేర్చుకోవాల్సి ఉందా అని ఆయన ప్రశ్నించారు. కర్ణాటక రాష్ట్రంలోని బెల్గావి ప్రాంతంలో నవ కర్ణాటక యాత్రలో భాగంగా సిద్దరామయ్య యోగి ఆదిత్యనాథ్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు.
కర్ణాటక రాష్ట్రంలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని యోగి ఆదిత్యనాద్ ఆరోపించారు. కులం, మతం పేరుతో సమాజాన్ని విడగొడుతోందని కాంగ్రెస్‌పై యోగి విమర్శలు గుప్పించారు.
అయితే యోగి ఆదిత్యనాధ్ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టీమ్ వినూత్న రీతిలో క్యాంపెయిన్ ప్రారంభించింది. కర్ణాటక ప్రజలను యోగి ఆదిత్యనాద్ అవమానపర్చాడని ఆరోపించింది. కర్ణాటక రాష్ట్రం అభివృద్దిలో వెనుకబడిందనే ఆరోపణలను యోగి చేశారని సోషల్ మీడియా టీమ్ ప్రచారాన్ని చేస్తోంది.
నా పేరు రామ, టిప్పు జయంతే కాదు, హనుమాన్, వాల్మీకి, బసవ, కనకదాస, కిట్టూరాణి, చెన్నమ్మ సంబరాలను కూడ నిర్వహిస్తామని కర్ణాటక సీఎం సిద్దరామయ్య యోగికి కౌంటర్ ఇచ్చారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications