ప్రధానికి మా సత్తా ఏమిటో చూపిస్తామని చెప్పిన సీఎం, కచ్చితంగా ఆసీట్లు మావే!

న్యూఢిల్లీ/బెంగళూరు: ఐదు ఉచిత గ్యారెంటీ హామీలతో ప్రజలను ఆదుకుని ఇంకా మంచి పేరు తెచ్చుకుంటామని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు. ఐదు హామీల అమలు ద్వారా కర్ణాటక మోడల్ అభివృద్ధితో వచ్చే లోక్ సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ ఇంకా పుంజుకుంటుందని, కర్ణాటకలో 20 నుంచి 24 సీట్లు గెలుస్తామన్న నమ్మకం ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు.

బుధవారం ఏఐసీసీ కార్యాలయంలో ఆరు గంటలపాటు సుదీర్ఘంగా జరిగిన సమావేశం అనంతరం సీఎం సిద్దరామయ్య మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మా అధినేత రాహుల్ గాంధీ, ఇతర ఏఐసీసీ నేతలతో కర్ణాటకకు చెందిన 30 మందికి పైగా పార్టీ నేతలు, మంత్రులతో సమావేశం నిర్వహించామని సిద్దరామయ్య చెప్పారు.

Karnataka Chief Minister Siddaramaiah who predicted the Lok Sabha elections

రెండు వేర్వేరు సమావేశాల్లో లోక్‌సభ ఎన్నికల గురించి, ఐదు హామీల అమలుపై సుదీర్ఘ చర్చ జరిగిందని సిద్దరామయ్య అన్నారు. ప్రతి లబ్ధిదారునికి ఐదు హామీలు చేరాలి. దాని విజయం లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిబింబించాలని సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైందని, తద్వారా పార్లమెంట్ ఎన్నికల్లో 20-24 సీట్లు గెలుచుకుంటామని పలువురు నాయకులు ధీమా వ్యక్తం చేశారని సిద్దరామయ్య అన్నారు.

లోక్‌సభ ఎన్నికల హామీలు, హామీల అమలుకు జిల్లా ఇన్‌చార్జి మంత్రులకు బాధ్యతలు అప్పగించామని, దీంతోపాటు మంత్రికి కొన్ని జిల్లాల బాధ్యతలు అప్పగించడంపై చర్చ సాగుతోందని, హామీ పథకాల అమలు వల్ల కర్ణాటక ఆర్థికంగా దివాళా తీస్తుందన్న ప్రధాని మోదీ ఆరోపణ పూర్తిగా అవాస్తం అని సీఎం సిద్దరామయ్య అన్నారు.

బడ్జెట్‌లో ఐదు హామీలకు నిధులు ఇచ్చామని, మేనిఫెస్టోలో ప్రకటించిన 76 హామీలకు కూడా నిధులు ఇచ్చామని సిద్దరాయయ్య అన్నారు. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు జీవితాలు బాగుపడేలా చూస్తామని, ప్రతి రోజు కోటిన్నర మందికి పైగా మన ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఉన్నారని సిద్దరామయ్య అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను ఛిద్రం చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి కర్ణాటక మోడల్ అభివృద్ధి ఏంటో చూపిస్తామని సీఎం సిద్దరాయయ్య ధీమా వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+