నాడు బ్రిటీష్ ల కోసం భారత్ పోరాటం, ఇప్పుడు బీజేపీ ముక్త భారత్ కోసం పోరాటం, డీకే !
బెంగళూరు: భారతదేశం నుండి బ్రిటిష్ వారిని తరిమికొట్టేందుకు మహాత్మా గాంధీ చేసిన పోరాటానికి 81 సంవత్సరాలు అయ్యిందని, ఇప్పుడు 8 దశాబ్దాల తర్వాత మళ్లీ క్విట్ ఇండియా పోరాటం మొదలైందని, అప్పుడు మేము బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడామని కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ అన్నారు. అయితే ఇప్పుడు మతోన్మాద, నియంతృత్వ ప్రభుత్వాన్ని, బీజేపీని తరిమికొట్టేందుకు పోరాడాలని, అందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్దంగా ఉండాలని డీకే. శివకుమార్ పిలుపునిచ్చారు.
బెంగళూరులోని క్వీన్స్ రోడ్డులోని కేపీసీసీ కార్యాలయంలో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవం సందర్బంగా డీకే శివకుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ముక్త భారత్‌ను భాజపా నిర్మిస్తుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారని, ఇప్పుడు మీరంతా బీజేపీ ముక్త్ భారత్ కోసం పని చెయ్యడానికి సిద్ధం కావాలని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు.

బెంగళూరులో ఇండియా' సమావేశం ముగిసిన తర్వాత అగ్రనేతలు మా పార్టీలోని అన్ని రాష్ట్రాల నేతలకు ఫోన్ చేసి కర్ణాటక ఫార్ములాను అనుసరించాలని చెప్పారని. కర్ణాటక మోడల్ అంటే ఏమిటి ? అని కొందు అడిగారని, ద్వేషాలు, వ్యక్తిగత ప్రతిష్టలు అన్నీ విడిచిపెట్టాలని, వ్యక్తి ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం అన్నట్లుగా పనిచేయడమే కర్ణాటకలోని కాగ్రెస్ పార్టీ నాయకుల సిద్దాంతం అని, కర్ణాటకను అందరూ ఫాలో కావడం మనకు గర్వకారణం అని డీకే శివకుమార్ అన్నారు.
తురువాత డీకే శివకుమార్ ఆయన ప్రసంగాన్ని కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ 136 సీట్లు గెలుచుకుంటుందని, అయితే ఎన్నికలకు ముందు దాదాపుగా ప్రజలు వాటిని నమ్మలేదని, సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని, త్వరలో ప్రభుత్వం వెళ్లిపోతుందని భావించారని, విపక్షాలు ప్రభుత్వ ఏర్పాటు చెయ్యడానికి సిద్దం అయ్యాయని అన్నారు. అయితే నా విశ్వాసం అబద్ధం కాదని సిద్దరామయ్య అన్నారు. నేను మాయమాటలు చేశానని, దానికి కారణం మాయమాటలు అని కొందరు నాయకులు అంటున్నారని, చెప్పిన వాగ్దానాలు నేరవేరుస్తామని సిద్దరామయ్య, డీకే శివకుమార్ చెప్పారు.












Click it and Unblock the Notifications