నిర్దోషి: ఆస్తుల కేసులో జయకు ఊరట, అనర్హత వేటు క్యాన్సిల్, ఇక సీఎంగా...
బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సోమవారం పెద్ద ఊరట లభించింది. ఈ కేసులో ఆమెను నిర్దోషిగా తేలుస్తూ న్యాయస్థానం తీర్పు ప్రకటించింది. ప్రత్యేక న్యాయస్థానం తీర్పును హైకోర్టు రద్దు చేసింది.
ఇది జయలలితకు అతిపెద్ద ఊరట అని చెప్పవచ్చు. ఈ కోర్టు తీర్పు ద్వారా ఆమె మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేందుకు అవకాశం వచ్చిందని చెప్పవచ్చు.
అంతకుముందు హైకోర్టు తుది తీర్పు నేపథ్యంలో బెంగళూరు పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. కోర్టుకు కిలోమీటర్ పరిధిలో 144వ సెక్షన్ విధించారు. తీర్పు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసున్నారు.
జయలలిత ముఖ్యమంత్రిగా..
జయలలిత అభిమానుల సందడి (ఫోటోలు)

హైకోర్టు తీర్పు న్యాయస్థానానికి అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో జయలలిత మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలుస్తోంది. జయలలిత తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. కోర్టు తీర్పు పట్ల తాము సంతోషం వ్యక్తం చేస్తున్నామని, జయలలిత మరో పది నిమిషాల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని జయ తరఫు న్యాయవాది కోర్టు వద్ద చెప్పారు.
జయలలిత తరఫు న్యాయవాది బీ కుమార్ మాట్లాడుతూ... ఇప్పుడు ఆమె ముఖ్యమంత్రి అవుతున్నారని 'వన్ ఇండియా'తో చెప్పారు. కోర్టు తీర్పు పట్ల తాము ఎంతో సంతోషంగా ఉన్నామని చెప్పారు. కాగా, జయలలితకు అనుకూలంగా వచ్చిన తీర్పు పైన సుబ్రహ్మణ్య స్వామి, కర్నాటక ప్రభుత్వం, డీఎంకే నేత అంబజ్ గన్‌లు సుప్రీం కోర్టులో సవాల్ చేసే అవకాశముంది.

పై తీర్పుకు హైకోర్టు ఏం చెప్పింది?
- జయలలిత అక్రమాస్తులు సంపాదించినట్లు ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయింది.
- జయలలిత, ఇతర నిందితులు తాము ఎలా సంపాదించామనే వివరాలు వెల్లడించారని, ఎలా సంపాదించామన్నది వారు చెప్పిన ఆధారాలు సంతృప్తికరంగా ఉన్నాయి.
- అక్రమాస్తులు ఎలా సంపాదించారనే దాని పైన ప్రాసిక్యూషన్ చెప్పిన వివరాలు సంతృప్తికరంగా లేవు.
విచారణాధికారులు ఏం చెప్పారు?
జయలలిత అక్రమాస్తులు నిరూపించేందుకు పూర్తి ఆధారాలు కోర్టుకు సమర్పించామని, ట్రయల్ కోర్టు వీటిపై పూర్తిస్థాయిలో విచారించిందని, హైకోర్టు తీర్పును తాము పూర్తిగా చదువుతామని, ఆ తర్వాత నిర్ణయిస్తామని చెప్పారు.

918 పేజీల తీర్పు
కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం తీర్పు పైన సుప్రీం కోర్టు గడప తొక్కనుంది. అంతకంటే ముందు హైకోర్టు ఇచ్చిన 918 పేజీల తీర్పును క్షుణ్ణంగా అధ్యయనం చేయనుంది. కర్నాటక ప్రభుత్వం న్యాయనిపుణులతో చర్చించనుంది. ఆ తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకోనుంది.
అనర్హత వేటు రద్దు
అక్రమాస్తుల కేసు నేపథ్యంలో ఎమ్మెల్యేగా జయలలిత గతంలో అనర్హులయ్యారు. ఇప్పుడు హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆమె అనర్హత రద్దు కానుంది.
పార్టీ ముఖ్యులతో కరుణానిధి...
జయలలితకు అనుకూలంగా తీర్పు వచ్చిన నేపథ్యంలో డీఎంకే అధ్యక్షులు కరుణానిధి పార్టీ ముఖ్యులతో భేటీ అయ్యారు. డీఎంకే నేతల ఇళ్ల వద్ద భద్రత పెంచారు.
జయలలితను కలిసిన పన్నీరు సెల్వం
తమిళనాడు ముఖ్యమంత్రి, ఇతర రాష్ట్ర మంత్రులు జయలలిత నివాసంలో ఆమెను కలిశారు. జయలలితను కోర్టు నిర్దోషిగా తేల్చడంతో అన్నాడీఎంకే కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. పార్లమెంటులో అన్నాడీఎంకే ఎంపీలు మిఠాయిలు పంచారు. తమిళనాడులో అభిమానులు పెద్ద ఎత్తున టపాసులు కాల్చారు.
17న ప్రమాణ స్వీకారం
జయలలితకు తీర్పు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఆమె తరఫు వారు ఆనందంతో పదినిమిషాల్లో జయ సీఎంగా చేస్తారని ప్రకటించినప్పటికీ... ఈ నెల 17వ తేదీన ఆమె తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలుస్తోంది. జయలలిత కోసం ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం ఏ క్షణంలోనైనా పదవిని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.
తీర్పుపై సుబ్రహ్మణ్య స్వామి
హైకోర్టు తీర్పుపై సుబ్రహ్మణ్య స్వామి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టుకు వెళ్తామని, జయలలితకు శిక్ష పడేలా చేస్తామన్నారు. జయలలితకు అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధిస్తూ గతంలో న్యాయస్థానం తీర్పు చెప్పింది. దీనిపై జయలలిత హైకోర్టును ఆశ్రయించగా.. ట్రయల్ కోర్టు తీర్పును కొట్టివేసింది.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications