రూ. కోట్లలో లంచం తీసుకుని జైల్లో శశికళకు రాచమర్యాదలు, కేసులో ట్విస్ట్, అధికారులు !
బెంగళూరు: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలి వీకే శశికళ అలియాస్ శశికళ నటరాజన్ కు బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో రాచమర్యాదలు చేశారని నమోదు అయిన కేసులో విచారణ ఎదుర్కొంటున్న పోలీసు అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. శశికళ కుటుంబ సభ్యుల దగ్గర రూ. 2 కోట్లు డబ్బులు లంచం తీసుకుని ఆమెకు సెంట్రల్ జైల్లో రాచమర్యాదలు చేశారని ఆరోపణలు ఉన్నాయి.
ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో అరెస్టు అయిన వీకే. శశికళ, ఇళవరసి తదితరులను బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు. శశికళ నాలుగు సంవత్సరాలు బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవించారు. ఆ సమయంలో శశికళకు జైల్లో ఖైదీలాగా చూడకుండా కర్ణాటక పోలీసు అధికారులు ఆమెను వీఐపీలాగా చూశారని ఆరోపణలు ఉన్నాయి.

ఈ ఆరోపణలు అప్పట్లో కర్ణాటకతో పాటు దేశాన్ని కుదిపేశాయి. అప్పటి కర్ణాటక జైళ్ల శాఖ డీజీపీ హెచ్ఎన్. సత్యనారాయణతో పాటు ప్రస్తుతం బెళగావి సెంట్రల్ జైల్ సూపరెండెంట్ క్రిష్ణకుమార్, కర్ణాటక జైళ్ల శాఖ అకాడమి డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఆర్. అనితా, జైళ్ల శాఖ ఇన్స్ పెక్టర్ గజరాజ్ మీద కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు విచారణ చేశారు.

అప్పటి కర్ణాటక ప్రభుత్వం రిటైడ్ ఐఏఎస్ అధికారి వినయ్ కుమార్ ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించింది. రిటైడ్ ఐఏఎస్ అధికారి వినయ్ కుమార్ విచారణ చేసి అప్పటి కర్ణాటక ప్రభుత్వానికి నివేదిక అందించారు. తరువాత జైళ్ల శాఖ డీజీపీ సత్యనారాయణకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని పోలీసు అధికారులు ఆయన్ను విచారణ నుంచి తప్పించారు.
తరువాత క్రిష్ణకుమార్, డాక్టర్ అనితా, జగరాజ్ మీద ఏసీబీ అధికారులు విచారణ చేసి కోర్టులో చార్జిషీట్ సమర్పించారు. మాకు శశికళ నటరాజన్ లంచం కేసుకు ఎలాంటి సంబంధం లేదని, ఈ కేసు నుంచి మాకు విముక్తి కల్పించాలని క్రిష్ణకుమార్, డాక్టర్ అనితా, గజరాజ్ వేర్వేరుగా కర్ణాటక హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

క్రిష్ణకుమార్, డాక్టర్ అనితా, గజరాజ్ సమర్పించిన వేర్వేరు పిటిషన్లను కర్ణాటక హైకోర్టు విచారణ చేసింది. ముగ్గురు అధికారులు శశికళ కుటుంబ సభ్యుల నుంచి లంచం తీసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు. సాక్షాలు లేవని, వీరి మీద నమోదు చేసిన కేసును కొట్టి వేస్తున్నామని కర్ణాటక హైకోర్టు తెలిపింది. వీకే శశికళ కుటంబ సభ్యుల నుంచి లంచం తీసుకుని ఆమెకు జైలులో రాచమర్యాదలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రిష్ణకుమార్, డాక్టర్ అనితా, ఇన్స్ పెక్టర్ గజరాజ హైకోర్టు ఆదేశాలతో ఊపిరిపీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications