జయలలిత బంగారు నగల కేసులో ట్విస్ట్, తమిళనాడుకు షాక్ ఇచ్చిన కర్ణాటక హైకోర్టు, దీపా దెబ్బతో!
బెంగళూరు నగరంలోని ప్రత్యేక కోర్టు ఆధీనంలో ఉన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జె. జయలలిత అక్రమంగా సంపాదించిన బంగారు ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియపై కర్ణాటక హైకోర్టు స్టే విధించింది. దీంతో బుధవారం బెంగళూరు ప్రత్యేక కోర్టులో జరగాల్సిన జయలలిత బంగారు ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోనుంది.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కూతురు జే. దీపా దాఖలు చేసిన దరఖాస్తును విచారించిన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి. ఎం. నవాజ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి అభ్యంతరం తెలియజేయాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి కర్ణాటక హైకోర్టు నోటీసులు ఇచ్చింది. జయలలిత బంగారు నగలు తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించే కేసు విచారణను కర్ణాటక హైకోర్టు మార్చి 26వ తేదీకి వాయిదా వేసింది.

పిటిషనర్ జే దీపా తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. జయలలితపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడకముందే ఆమె మరణించారని గుర్తు చేశారు. ఈ కారణంగా జయలలిత అన్ని అభియోగాల నుండి విముక్తి పొందారని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అందువల్ల జయలలితకు చట్టబద్ధమైన వారసులు అయిన మాకు ఆమె బంగారు ఆభరణాలన్నింటినీ అప్పగించాలని పిటిషనర్ దీపా కర్ణాటక హైకోర్టుకు మనవి చేశారు.
ఈ వాదనలు నమోదు చేసుకున్న కర్ణాటక హైకోర్టు ధర్మాసనం బుధవారం నుంచి జరగాల్సిన జయలలిత బంగారు ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియపై అభ్యంతరం తెలపాలని ప్రభుత్వానికి సూచిస్తూ స్టే విధించి బెంగళూరు నగరంలోని ప్రత్యేక కోర్టుకు నోటీసులు ఇచ్చి విచారణను వాయిదా వేసింది. ఈ కేసు విచారణ కోసం కర్ణాటక ప్రభుత్వం వెచ్చించిన రూ. 5 కోట్లకు తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వానికి రూ 5 కోట్ల డీడీ జారీ చేసింది. అయితే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోకి రూ 5 కోట్లు వచ్చే ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని న్యాయవాది తెలిపారు.
బెంగళూరులోని ప్రత్యేక కోర్టులో జయలలితకు సంబంధించిన బంగారు ఆభరణాలతో పాటు విలువైన వస్తువులు ఉన్నాయి తమిళనాడు దివంగత సీఎం జయలలితకు చెందిన 7, 040 గ్రాముల బరువు ఉన్న 468 వజ్రాలతో తయారు చేసిన బంగారు నగలు, 700 కిలోల వెండి వస్తువులు అప్పట్లో స్వాధీనం చేసుకున్నారు. 740 ఖరీదైన చెప్పులు, 11,344 పట్టు చీరలు, 250 శాలువాలు, 12 రిఫ్రిజిరేటర్లు, 10 టీవీ సెట్ లు, 8 వీసీఆర్‌లు, 1 వీడియో కెమెరా, 4 సీడీ ప్లేయర్లు, 2 ఆడియో డెక్స్, 24 టూ ఇన్ వన్ టేప్ రికార్డర్లు, 1,040 వీడియో క్యాసెట్లు, 3 ఐరన్ లాకర్లు, 1,93,202 రూ. నగదుతోపాటు పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications