కాంగ్రెస్ లోకి బళ్లారి ఎంపీ శ్రీరాములు అల్లుడు, బీజేపీ ఎమ్మెల్యే, అదే జరిగితే క్లీన్, క్యూ?
బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బళ్లారి జిల్లాలో బీజేపీకి భారీ దెబ్బపడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ తన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. బీజేపీ మీద తిరుగుబాటు చేసి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యే అయిన బి. నాగేంద్ర కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్దం అయ్యారు. ఇప్పుడు బళ్లారి ఎంపీ బి. శ్రీరాములుకు వరసకు అల్లుడు, బీజేపీ కంప్లీ నియోజక వర్గం ఎమ్మెల్యే సురేష్ బాబు, మరో సీనియర్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్దం అయ్యారని సోమవారం ప్రచారం మొదలైయ్యింది.

సీఎం ఇంటిలో చర్చలు ?
సీఎం సిద్దరామయ్య అధికారిక నివాసంలో లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖార్గే, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ కే.సి. వేణుగోపాల్ చర్చలు జరిపారని, త్వరలో బీజేపీ శాసన సభ్వుడు టీహెచ్. సురేష్ బాబు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

సీఎం వ్యతిరేకం
బీజేపీకి చెందిన ఆనంద్ సింగ్, బి, నాగేంద్ర కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మొదట అంగీకరించిన సీఎం సిద్దరామయ్య సురేష్ బాబు విషయంలో మాత్రం తీవ్రస్థాయిలో వ్యతిరేకించారని ప్రచారం జరిగింది. అయితే చివరికి సురేష్ బాబు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సీఎం సిద్దరామయ్య అంగీకరించారని సమాచారం.
Recommended Video


శ్రీరాములు అల్లుడు
బళ్లారి బీజేపీ ఎంపీ శ్రీరాములుకు వరసకు అల్లుడు అయ్యే బీజేపీ ఎమ్మెల్యే సురేష్ బాబు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. నిజంగా సురేష్ బాబు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా ? లేదా ? అనే విషయంపై ఇంకా స్పష్టతరాలేదు.

గాలి, శ్రీరాములు అనుచరులు
మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి, బళ్లారి ఎంపీ శ్రీరాములుకు ప్రధాన అనుచరులు అయిన ఆనంద్ సింగ్, నాగేంద్రను కాంగ్రెస్ పార్టీలోకి లాక్కోవడానికి ప్రయత్నించి విజయం సాధించిన ఆ పార్టీ నాయకులు బళ్లారి జిల్లాలో బీజేపీని కోలుకోలేని దెబ్బకొట్టాలని పక్కా ప్లాన్ వేస్తున్నారని సమాచారం.

బీజేపీలో ఆందోళన
బళ్లారి జిల్లాకు చెందిన బీజేపీ నాయకులు వరసపెట్టి కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తుండటంతో ఆ జిల్లాలో ఆ పార్టీకి భారీ దెబ్బ పడుతోందని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఈనెల 10వ తేదీ రాహుల్ గాంధీ కర్ణాటక పర్యటన సందర్బంగా కాంగ్రెస్ పార్టీలో సురేష్ బాబు చేరుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది, అయితే ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు, సురేష్ బాబు కాని ఇంత వరకూ అధికారికంగా స్పంధించలేదు.

స్థానిక నేతలు వ్యతిరేకం
బళ్లారికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సంతోష్ లాడ్ ను సంప్రధించకుండా హైకమాండ్ తో చర్చలు జరిపి ఆనంద్ సింగ్, నాగేంద్రను పార్టీలో చేర్చుకున్నారని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. బీజేపీ నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంతో అదే పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు దీపక్ సింగ్ తీవ్రస్థాయిలో బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారు.
-
కరీంనగర్ నుండి కొండగట్టుకు కేంద్రమంత్రి అంజన్న ఆశీర్వాద యాత్ర -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం












Click it and Unblock the Notifications