9వ తరగతి పాస్ అయిన మంత్రి, ఆస్తుల విలువ ఎన్ని వేల కోట్లు అంటే ?, మైండ్ బ్లాక్ !
బెంగళూరు/హోస్ కోటే: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా పలు పార్టీల నాయకులు నామినేషన్లు వేసే బిజీలో ఉన్నారు. నామినేసన్లు వేసిన వారిలో కర్ణాటక మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. కర్ణాటకకు చెందిన ఓ సినియర్ మంత్రి విద్యార్హత, ఆయన ఆస్తులు ఎన్ని వేల కోట్ల రూపాయలు అని తెలుసుకున్న కన్నడిగులు షాక్ అవుతున్నారు.
కర్ణాటక రాజకీయాల్లో ఎంటీబీ నాగరాజ్ చక్రం తిప్పారు. 20 ఏళ్లలో నగర సభ సభ్యుడు (కౌన్సిలర్) స్థాయి నుంచి ఎమ్మెల్యే, తరువాత రెండు సార్లు మంత్రిగా, ఎమ్మెల్సీగా ఆయన ఎవ్వరూ ఊహించిన విధంగా రాజకీయాల్లో దూసుకుపోయారు. గతంలో జరిగి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓడిపోయిన ఎంటీబీ నాగరాజ్ తరువాత ఎమ్మెల్సీ అయ్యి మంత్రి కూడా అయ్యారు.
సోమవారం బెంగళూరు గ్రామీణ జిల్లాలోని హోస్ కోటే నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చెయ్యడానికి మంత్రి ఎంటీబీ నాగరాజ్ నామినేషన్ వేశారు. ఈ సందర్బంగా మంత్రి ఎంటీబీ నాగరాజ్ ఆయన విద్యార్హత, ఆయన ఆస్తులు, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాల అఫిడవిట్ ను ఎన్నికల కమీషన్ కు సమర్పించారు.

9వ తరగతి పాస్ అయిన మంత్రి ఎంటీబీ నాగరాజ్ ఆస్తుల విలువ అక్షరాలా రూ. 1, 510 కోట్లు. దేశంలోని అతి పెద్ద శ్రీమంత్లుల్లో ఒక్కరైన రాజకీయ నాయకుడిగా ఎంటీబీ నాగరాజ్ గుర్తింపు తెచ్చుకున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నిలక సందర్బంగా ఎంటీబీ నాగరాజ్ తన ఆస్తుల విలువ రూ. 1, 015 కోట్లు అని ఎన్నికల అధికారులకు అఫిడవిట్ సమర్పించారు.
గత నాలుగు ఏళ్లలో ఎంటీబీ నాగరాజ్ ఆస్తుల విలువ రూ. 495 కోట్లకు పెరిగింది. 9వ తరగతి మాత్రమే చదివి మంత్రి అయిన ఎంటీబీ నాగరాజ్ తిరుగుతున్న కార్లు విలువ రూ. 1. 72 కోటలు, ఐ 10, ల్యాండ్ రోవర్ డివెండర్, బోలెరో వాహనాలు ఉన్నాయి. ఎంటీబీ నాగరాజ్ భార్య శాంతకుమారి పరు మీద రూ. 1.33 కోట్ల విలువైన రెండు ఖరీవైన కార్లు ఉన్నాయి.
మంత్రి ఎంటీబీ నాగరాజ్ కు రూ. 71 కోట్లు అప్పులు ఉన్నాయి. ఎంటీబీ నాగరాజ్ భార్య శాంతకుమారి పేరు మీద రూ. 27 కోట్ల అప్పు ఉంది. ఎంటీబీ నాగరాజ్ వివిద బ్యాంకుల్లో రూ. 98 కోట్లు అప్పులు చేశారు. 2019లో జరిగిన ఉప ఎన్నికల సందర్బంగా ఎంటీబీ నాగరాజ్ భార్య శాంతకుమారి ఆస్తుల విలువ రూ. 167.34 కోట్లు ఉంది. అయితే ఇప్పుడు ఆ ఆస్తుల విలువ రూ. 372 కోట్లకు పడిపోయింది.

2019లో శాంతకుమారికి ఉన్న రూ. 167 కోట స్థిరాస్తి విలువ ఇప్పుడు రూ. 274 కోట్లకు పెరిగిపోయింది. ఎంటీబీ నాగరాజ్ దగ్గర రూ. 2. 14 కోట్ల విలువైన వజ్రాలు, బంగారు నగలు, వెండి వస్తులు ఉన్నాయి. ఎంటీబీ నాగరాజ్ భార్య శాంతకుమారి దగ్గర రూ. 1. 64 కోట్ల విలువైన రెండు కేజీల బంగారు, వజ్రాల నగలు, వెండి వస్తువులు ఉన్నాయి.
ఇక ఎంటీబీ నాగరాజ్ ప్రత్యర్థి అభ్యర్థి (కాంగ్రెస్ పార్టీ) శరత్ బచ్చేగౌడకు రూ. 104. 74 కోట్ల విలువైన ఆస్తి ఉంది. 2019లో జరిగిన ఉప ఎన్నికల్లో శరత్ బచ్చేగౌడ ఆస్తుల విలువ రూ. 135. 65 కోట్లు, అయితే నాలుగు ఏళ్లలో శరత్ బచ్చేగౌడ ఆస్తితో రూ. 31 కోట్ల విలువైన ఆస్తులు ఆవిరి అయ్యాయి. శరత్ బచ్చేగౌడ దగ్గర రూ. 52 లక్షల విలువైన రెండు ఖరీదైన కార్లు ఉన్నాయి.
శరత్ బచ్చేగౌడ భార్య ప్రతిభా దగ్గర రూ. 52 లక్షల విలువైన బెంజ్ కారు ఉంది. ఎంటీబీ నాగరాజ్, శరత్ బచ్చేగౌడ ఇద్దరు ఈ వివరాలను ఎన్నికల కమీషన్ అధికారులకు సమర్పించారు. మొత్తం మీద వేల కోట్ల ఆస్తులు ఉన్న ఎంటీబీ నాగరాజ్ 9వ తరగతి మాత్రమే పాస్ కావడం, మంత్రిగా పని చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
-
కర్ణాటకలో సంచలన తీర్పు: నిర్లక్ష్యంపై సీరియస్.. -
న్యాయం చేయలేకపోయా - కవిత ఆవేదన -
కేసీఆర్, హరీశ్ ను జైలులో పెట్టిన తర్వాతే - రేవంత్ సంచలనం..!! -
జగన్ అరెస్ట్ ఖాయం - తేల్చేసిన బీజేపీ ముఖ్య నేత..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది!












Click it and Unblock the Notifications