జుట్టు పీక్కుంటున్న సీఎం, ఎమ్మెల్యే రాసలీలల ఫోటోలు వైరల్, మేడమ్ క్లారిటీ !
బెంగళూరు/పుత్తూరు: ఇప్పటికే కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు వివాదంలో చిక్కుకోవడంతో కర్ణాటకలోని బసవరాజ్ బోమ్మయ్ ప్రభుత్వం జుట్టు పీక్కుంటున్నది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల డేట్ ప్రకటించిన తరువాత బీజేపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నట్లు ఉండే కొన్ని అశ్లీల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని పుత్తూరు అసెంబ్లీ నియోజక వర్గం ఎమ్మెల్యే సంజీవ్ మఠందూర్ అలియాస్ సంజీవ్ పోలీసులను ఆశ్రయించి తనకు న్యాయం చెయ్యాలని మనవి చేశారు. ఓ వివాహిత మహిళ, బీజేపీ ఎమ్మెల్యే సంజీవ్ చాలా సన్నిహితంగా, అశ్లీలంగా ఉన్నట్లు ఉండే ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో ఆఫోటోలు వైరల్ అయ్యాయి.

ఎన్నికల సమయంలో ఇలాంటి ఫోటోలు చూసిన బీజేపీ కార్యకర్తలు. ఎమ్మెల్యే సంజీవ్ సన్నిహితులు హడలిపోయారు. మ్యాటర్ తెలుసుకున్న బీజేపీ ఎమ్మెల్యే సంజీవ్ మఠందూర్ ఉప్పినంగడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో ఎమ్మెల్యేతో పాటు ఫోటోలో ఉన్న మహిళ కూడా పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టింది.
ఈ సందర్బంగా ఆ ఫోటోలోని మహిళ గురువారం మీడియాతో మాట్లాడింది. తాను ఇంత వరకు ఎమ్మెల్యే సంజీవ్ ను నేరుగా ఎప్పుడు కలుసుకోలేదని, ఆయనతో తనకు పరిచయం కూడా లేదని అన్నారు. తన ఫోటోలు, ఎమ్మెల్యే సంజీవ్ ఫోటోలు ఎడిట్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేశారని ఆమె ఆరోపించారు.
ఎమ్మెల్యే సంజీవ్ తో తాను సన్నిహితంగా ఉన్నట్లు ఎడిట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో చూసిన నేను, నాకుటుంబ సభ్యులు అవమానంతో తలదించుకోవాల్సి వస్తోందని, ఇలాంటి ఎడిటింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి మా ఇంటి పరువు తీసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోలని ఆమె పోలీసులకు మనవి చేశారు. ఈ ఫోటోలు ఎవరు ఎడిటిట్ చేయించారో తనకు తెలుసని, త్వరలో వారి కథ చూస్తానని బీజేపీ ఎమ్మెల్యే సంజీవ్ అంటున్నారు.












Click it and Unblock the Notifications