Karnataka Polls : కాంగ్రెస్ పార్టీ భజరంగ్ దళ్ నిషేధం హామీపై మోడీ రియాక్షన్ ఇదే..!

కర్నాటకలో ఎన్నికల వేళ మత రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. నిన్న బీజేపీ తమ మ్యానిఫెస్టో విడుదల చేసి తాము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని, ఎన్నార్సీ అమలు చేస్తామని హామీలు ఇవ్వగా.. ఇవాళ మ్యానిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ.. భజరంగ్ దళ్ ను నిషేధిస్తామని హామీ ఇచ్చింది. దీంతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమైంది. ఇదే కోవలో ప్రధాని మోడీ కూడా భజరంగ్ దళ్ నిషేధం హామీపై స్పందించారు.

భజరంగ్‌దళ్‌పై నిషేధం విధిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ మేనిఫెస్టోపై ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ధ్వజమెత్తారు. శ్రీరాముడు, హనుమంతుని పేర్లను జపించే వారితో పాత పార్టీకి (కాంగ్రెస్ పార్టీ) సమస్య ఉందని అన్నారు. కర్ణాటకలోని హోసాపేటలో ఎన్నికల సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, "శ్రీ హనుమంతుని జన్మస్థలంలో ఉండటం నా అదృష్టం, కానీ అదే సమయంలో నేను ఇక్కడ ఉన్నాను అని తెలుసుకోవడం దురదృష్టకరమని మోడీ వ్యాఖ్యానించారు.

Karnataka Polls : pm modi reacted on congresss bajrang dal ban promise, says unfortunate

కాంగ్రెస్‌కు రాముడితో సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు జై బజరంగ్ బలి అని నినాదాలు చేసే వారితో కూడా వారికి సమస్య ఉందని ప్రధాని మోడీ ఆరోపించారు. అంతకుముందు చిత్రదుర్గలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్, జేడీ(ఎస్)లు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని మోడీ ఆరోపించారు. కాంగ్రెస్ చరిత్ర "ఉగ్రవాదం, ఉగ్రవాదులను శాంతింపజేయడమే" అని ప్రధాని మోదీ విమర్శించారు. సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడులు జరిగినప్పుడు పార్టీ సైనికుల్ని ప్రశ్నించిందని గుర్తుచేశారు.

కర్నాటక ప్రజలు కాంగ్రెస్, జేడీఎస్ రెండింటి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోడీ కోరారు. ఎందుకంటే ఈ రెండు పార్టీలు వాస్తవానికి వారి హృదయాల పరంగా ఒకటేనన్నారు. తద్వారా బీజేపీని కాదని ఎట్టి పరిస్ధితుల్లోనూ కాంగ్రెస్, జేడీఎస్ కు ఓటు వేయొద్దని ప్రధాని కోరారు. ఇప్పటికే కర్నాటకలో కాంగ్రెస్ గెలుపు తథ్యమంటూ పలు సర్వేలు వెలువడుతున్న నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+