వామ్మో.. తహశీల్దార్‌కు వెరైటీ వినతి పత్రం.. పిల్లనివ్వడం లేదంట..
దేశంలో స్త్రీల కన్నా పురుషులే అధికం.. దీంతో పెళ్లికానీ ప్రసాద్‌లు ఎక్కువ అవుతున్నారు. కొన్ని కమ్యునిటీల్లో కాదు.. ఇప్పుడు దాదాపు అన్నీ కులాల్లో అదే సమస్య.. దీనికి సంబంధించి కర్ణాటకలో విచిత్ర పరిస్థితి నెలకొంది. కొందరు యువకులు తహశీల్దారుకు మొరపెట్టుకున్నారు. ప్లీజ్ మేడం.. పెళ్లి చేసుకోవాలి.. పిల్లలు వెతికి పెట్టండి అని విన్నవించుకున్నారు. తుమకూరు జిల్లా కుణిగల్ తాలూకా లక్కగొండన హళ్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది.
తహసీల్దారు తేజస్విని నేతృత్వంలో జరిగిన జన స్పందన కార్యక్రమంలో లక్కగొడనహళ్లి తిమ్మాపురం గ్రామానికి చెందిన మంది యువకులు వచ్చారు. తాము వివాహం చేసుకోవాలనుకుంటున్నాం..కానీ ఆడపిల్లలు దొరకటంలేదు..దయచేసి మీరే మాకు వధువులను వెదికి పెట్టండి అని రాసి వినతిపత్రం అందించారు. తిమ్మాపుర గ్రామానికి చెందిన వ్యవసాయ కుటుంబానికి చెందిన యువకులు తహసీల్దారు తేజస్వినికి ఇటువంటి వినూత్న వినతిపత్రం అందజేశారు. ఆ యువకులు గతంలో కూడా తుమకూరు జిల్లా అధికారికి కూడా ఇటువంటి వినతిపత్రం ఇచ్చామని చెప్పటం విశేషం.

తుమకూరు జిల్లాలో చాలామంది యువకులకు వివాహాలు కావటం లేదు. అమ్మాయిల సంఖ్య తగ్గిపోవటం దీనికి ఓ కారణమైతే.. మరో కారణం అక్కడ ఉండే వ్యవసాయం చేసే యువకులకు పిల్లనివ్వటానికి ఎవ్వరు ముందుకు రాకపోవటం మరో కారణం. ఏదో చిన్న ఉద్యోగం ఉంటేనే పిల్లనిస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయం చేసే యువకులకు పిల్లనివ్వటానికి ఎవ్వరు ఇష్టపడటం లేదు.
చిక్కనాయకనహళ్లి తాలూకా వ్యవసాయం చేసే యువకులు దూర ప్రాంతాల నుంచి పిల్లలను చూసుకుని వివాహం చేసుకుంటున్నారు. అయినా అందరికి వివాహాలు కావటం లేదు.దీంతో వ్యవసాయం చేసే కుటుంబాలకు చెందిన యువకులు తమకు వధువులను వెదికి పెట్టండి అని తహసీల్దారు తేజస్వినికి వినతిపత్రం ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది.
దేశంలో స్త్రీ, పురుష నిష్పత్రిలో తేడా ఉంది. పురుషులే అధికంగా ఉన్నారు. దీంతో స్త్రీల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఇదీ వివాహాలపై ప్రభావం చూపుతోంది. అయితే తుమకూరులో మాత్రం వ్యవసాయం చేసేవారికి పిల్లనివ్వం అని మాత్రం చెబుతున్నారు.
-
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..!












Click it and Unblock the Notifications