కరెక్ట్ టైమ్ లో హ్యాండ్ ఇచ్చిన నటి ఖుష్బు, నావల్లకావడంలేదని లేఖ, ఏం జరిగిందంటే ?
దేశంలో మొత్తం లోక్ సభ ఎన్నికల వేడితో హాట్ హాట్ గా ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీల్లో స్టార్ క్యాంపెయినర్స్ చాలా మంది ఉన్నారు. తమిళనాడు జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నాయకురాలు ఖుష్బు సుందర్ ప్రధాన స్టార్ క్యాంపెయినర్. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన తరువాత బీజేపీలో చేరిన తర్వాత తొలి లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొంటున్న నటి ఖుష్బు బీజేపీ నాయకులకు షాక్ ఇచ్చారు.
బీజేపీ తరపున లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆ పార్టీ నాయకుల తరఫున అండగా నిలబడాల్సిన నటి ఖుష్బు చేతులు ఎత్తేశారు. అయితే ఎన్నికల ప్రచారం నుంచి తప్పుకోవాలని ఖుష్బు నిర్ణయించారని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బు సుందర్ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చెయ్యాలని చాలా మంది ఆ పార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

2019లో ఢిల్లీలో జరిగిన ఓ ప్రమాదంలో తన కాలికి గాయం అయ్యిందని, అదే కారణంతో తాను ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం చెయ్యలేకపోతున్నానని నటి ఖుష్బు లేఖలో పేర్కొన్నారని వెలుగు చూసింది. తన కాలు ఫ్రాక్చర్ అయిందని, ఈ గాయం గత ఐదేళ్లుగా తనను వేధిస్తున్నదని నటి ఖుష్బు జేపీ నడ్డాకు రాసిన లేఖలో వివరించారని సమాచారం. లోక్ సభ ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనవద్దని వైద్యుల సలహా ఇచ్చారని, అయినా తాను తమిళనాడు రాష్ట్రంలో జరుగుతున్న లోక్ సభ ఎన్నికలలో ప్రచారాన్ని కొనసాగాలని అనుకున్నానని ఖుష్బు వివరించారు.

అయితే ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని, ఇప్పుడు అవసరమైన విరామం తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు నటి ఖుష్బు భావోద్వేగంతో లేఖ రాశారని వెలుగు చూసింది.ప్రస్తుతం తన కార్యకలాపాలను తగ్గించవలసి ఉందని, ప్రత్యేకించి విస్తృతమైన ప్రయాణాలు చెయ్యకూడదని, ఎక్కువ సేపు నిలబడకూడదని వైద్యులు సూచించారని నటి ఖుష్బు బీజేపీ హైకమాండ్ కు రాసిన లేఖలో వివరించారు.
ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం మానేయాలి వైద్యులు సూచించారని, అందుకే తాను ఎన్నికల ప్రచారం చెయ్యడానికి అవకాశం లేకపోయిందని, దయచేసి మీరు అర్థం చేసుకుంటారని బావిస్తున్నానని నటి ఖుష్బు లేఖ రాశారు ప్రత్యక్ష ప్రచారం నుంచి తప్పుకున్నప్పటికీ పార్టీ కోసం తాను పని చేస్తానని నటి ఖుష్బు వివరించారు. బీజేపీ విధానాలు, కార్యక్రమాల కోసం తనపనిని కొనసాగించేందుకు సోషల్ మీడియా వేదికగా యాక్టివ్‌గా ఉంటానని లేఖలో స్పష్టం చేశారు.
లోక్‌సభ ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ అభ్యర్థుల కోసం ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్న నటి ఖుష్బు అనూహ్యంగా లోక్ సభ ఎన్నికల ప్రచార బాధ్యతల నుంచి విరామం తీసుకోవడం గమనార్హం. ఇది ఆరోగ్య సమస్య లేక మరేదైనా కారణం ఉందా అనే చర్చ ఇప్పటికే మొదలయ్యింది. మొత్తం మీద నటి ఖుష్బు లోక్ సభ ఎన్నికల ప్రచారం నుంచి తప్పుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. .
-
యుద్ధం వేళ మోదీ చాణక్యం.. కర్ర విరక్కుండా.. పాము చావకుండా..! -
రేవంత్ కు కేంద్రం బంపర్ బొనాంజా , 2028 తర్వాతా - మారుతున్న లెక్కలు..!! -
Noida jinx: అక్కడికి వెళ్తే పదవి పోయినట్లేనా ? సెంటిమెంట్ పై మోడీ కామెంట్స్..! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications