యోగా టీచర్‌ను వివస్త్రను చేసి, పూడ్చిపెట్టారు: ఐనా ఆమె బతికింది!
బెంగళూరు: ఓ 34 ఏళ్ల యోగా టీచర్ తన యోగా టెక్నిక్‌తో దుర్మార్గుల బారి నుంచి ప్రాణాలతో బయటపడింది. ఆమెను కిడ్నాప్ చేసిన దుండగులు.. అడవికి తీసుకెళ్లి వివస్త్రను చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆ తర్వాత గొంతునులిమారు. ఆ తర్వాత చనిపోయిందనుకును అక్కడే పూడ్చిపెట్టారు. కొంతమేర మాత్రమే ఆమెపై మట్టి పోశారు. అయితే, ఆమె తన యోగా టెక్నిక్ ద్వారా ప్రాణాలు కాపాడుకోగలిగారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని దేవనహళ్లిలో జరిగింది. ప్రస్తుతం ఆమె చిక్కబల్లాపూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటనలో నలుగురు పురుషులు, ఒక మహిళ, ఒక బాల్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. అరెస్టయిన మహిళ బిందు (27) సూచన మేరకు యోగా టీచర్ తమన్నాని కిడ్నాప్ చేశారు. బిందు తన భర్త సంతోష్ కుమార్ తమన్నాకు సన్నిహితంగా ఉండటంపై అనుమానం కలగడంతో.. ఆ మహిళపై నిఘా పెట్టమని బెంగళూరులో ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని నిర్వహిస్తున్న తన స్నేహితుడు సతీష్ రెడ్డికి చెప్పిందని పోలీసు వర్గాలు తెలిపాయి.

సతీష్ తమన్నా దగ్గర యోగా నేర్చుకుంటాననే నెపంతో ఆమెతో స్నేహం చేశాడని నిందితురాలు ఆరోపించారు. అక్టోబర్ 23న 10.30 గంటలకు తమన్నాను ముగ్గురు పురుషులు, ఒక బాలుడు వాహనంలో కిడ్నాప్ చేశారు. వీరంతా నేరుగా సిడ్లఘట్ట తాలూకా ధనమిత్తెనహళ్లిలోని అటవీ ప్రాంతానికి ఆమెను తీసుకెళ్లారు. తమన్నాను బెదిరించి, దుస్తులు విప్పి వేధించారు. అనంతరం కేబుల్‌తో ఆమె గొంతునులిమి చంపేందుకు ప్రయత్నించారు.
యోగా టీచర్ అయిన తమన్నా.. తన శ్వాసను నిలిపివేయడంతో ఆమె మృతి చెందిందని నిందితులు భావించారు. ఆ తర్వాత ఆమె వద్ద ఉన్న ఆభరణాలను తీసుకుని.. ఆమెను అక్కడే పాతిపెట్టారు. ఆమెపై మట్టి పెద్దగా పోయకపోవడంతో తమన్నా బయటకి వచ్చి ప్రాణాలు కాపాడుకుంది. ఆ తర్వాత స్థానికుల సహాయంతో ఆస్పత్రిలో చేరింది.
ఈ ఘటనలో ప్రధాన నిందితురాలు బిందుతో పాటు సతీష్‌రెడ్డి (40), రమణ (34), నాగేంద్రరెడ్డి (35), రవిచంద్ర (27), మైనర్ బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు. సతీష్, రమణ, నాగేంద్ర ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు కాగా, రవిచంద్ర, బాలుడు రాయచూరు జిల్లాకు చెందిన వారు. నిందితులను కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుంచి పోలీసులు అరెస్టు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications