ముగ్గురు సీఎంలు చేయలేని పని సువేందు చేసి చూపిస్తారా..!

కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం పక్కనే ఉన్న 136 ఏళ్ల బంక్రా మసీదు తరలింపు అంశం మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. విమాన భద్రత, రన్‌వే కార్యకలాపాలకు ఇది ఆటంకంగా మారుతోందని విమానాశ్రయ అధికారులు దశాబ్దాలుగా చెబుతున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా గత ప్రభుత్వాలు ఈ కీలక సమస్యను పట్టించుకోలేదనే విమర్శలున్నాయి.

పశ్చిమ బెంగాల్‌ను పాలించిన జ్యోతి బసు, బుద్ధదేవ్ భట్టాచార్జీ (సీపీఎం), అలాగే మమతా బెనర్జీ (టీఎంసీ) వంటి ముఖ్యమంత్రులందరూ మసీదు తరలింపు ప్రయత్నాలను అడ్డుకున్నారు. అయితే, ప్రస్తుతం సువేందు అధికారి నేతృత్వంలో బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటంతో, బంక్రా మసీదు తరలింపు ప్రతిపాదనలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే, ఈ ప్రార్థనా మందిరానికి స్థానచలనం తప్పదని రాజకీయ విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు.

kolakata-bankra-mosque-relocation-near-airport-raises-safety-and-policy-questions-also-cm-suvendu-de

"గౌరీపసూర్ జామే మస్జిద్" లేదా "బంక్రా మసీదు" విమానాశ్రయం రెండో రన్‌వేకి కేవలం 165 మీటర్ల దూరంలో ఉంది. వాస్తవానికి, విమానయాన నియమావళి ప్రకారం ఇది కనీసం 240 మీటర్ల దూరంలో ఉండాలి. ఈ అసాధారణ సామీప్యత తీవ్ర భద్రతా ఆందోళనలను పెంచుతోంది. దీని కారణంగా విమానాలు దిగే టచ్‌డౌన్ పాయింట్‌ను 88 మీటర్లు మార్చాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.

పెద్ద విమానాల ల్యాండింగ్‌కు ఇది సమస్యలు సృష్టిస్తోంది. అత్యవసర ల్యాండింగ్ సమయంలో పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. విమానాశ్రయం ఆపరేషనల్ జోన్‌లోనే ఈ మసీదు ఉండటం వల్ల ప్రయాణీకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని వారు స్పష్టం చేస్తున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) అధికారులు ఇటీవల మసీదు ప్రాంగణాన్ని సందర్శించి, కమిటీ సభ్యులతో తరలింపుపై చర్చలు జరిపారు. మే 28న బక్రీద్ పండుగ ఉన్నందున, అప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోరాదని జిల్లా మరియు విమానాశ్రయ అధికారులు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈద్ తర్వాత దీనిపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

ప్రస్తుతం రోజుకు సగటున 10 నుంచి 25 మంది భక్తులు ఈ మసీదులో నమాజ్ చేస్తున్నారు. శుక్రవారాల్లో ఈ సంఖ్య 80 మందికి చేరుతుంది. మసీదు ప్రవేశానికి ముందు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) సిబ్బంది కఠినమైన భద్రతా తనిఖీలు మరియు గుర్తింపు కార్డుల పరిశీలన తర్వాతే వారికి ప్రార్థనలకు అనుమతి లభిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+