చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Torture: ఫ్రెండ్ దగ్గర రూ. 5 లక్షలు అప్పు తీసుకున్న లేడీ, రూ. 30 లక్షలు వడ్డీ, ఇల్లు రాసివ్వాలి !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ టీనగర్: వ్యాపారం చేస్తున్న మహిళ తెలిసిన వాళ్ల దగ్గర డబ్బులు అప్పు తీసుకుంటున్నది. వ్యాపారం చేస్తూ తీసుకున్న రుణంకు వడ్డీ చెల్లిస్తున్నది. కరోనా వైరస్ వ్యాపించక ముందు ఆమె తెలిసిన మహిళ దగ్గర రూ. 5 లక్షలు అప్పు తీసుకుంది. వ్యాపారంలో నష్టం రావడంతో తీసుకున్న అప్పుకు వడ్డీ చెల్లించలేకపోయింది. ఇదే సమయంలో అప్పు ఇచ్చిన మహిళతో పాటు ఆమె కుటుంబ సభ్యులు టార్చర్ పెట్టారు. రూ. 5 లక్షలకు రూ. 30 లక్షలు వడ్డీ అయ్యింది, మొత్తం డబ్బులు చెల్లించాలని, లేదంటే సిటీలోని నీ ఇంటిని మా పేరుతో రాసివాల్వాలని వేధింపులకు గురి చేశారని తెలిసింది. ఇద్దరు కుమార్తెలు ఉన్న మహిళ డబ్బులు తిరిగి ఇవ్వలేక నానా ఇబ్బందులు ఎదుర్కొంది. ఇదే సమయంలో అప్పులు చేసిన మహిళ మంటల్లో కాలిపోయి చనిపోవడం కలకలం రేపింది.

Sadist: తమ్ముడితో భార్య అక్రమ సంబంధం, భార్యకు విషం తాగించి చచ్చే వరకు వెయిట్ చేసిన భర్త, క్లైమాక్స్ !

 వ్యాపారం చేస్తున్న మహిళ

వ్యాపారం చేస్తున్న మహిళ

చెన్నైలోని పెరంబూరులోని పులియంతోప్పు ప్రాంతంలో చిత్రా అనే మహిళ నివాసం ఉంటున్నది. వ్యాపారం చేస్తున్న చిత్రా తెలిసిన వాళ్ల దగ్గర డబ్బులు అప్పు తీసుకుంటున్నది. వ్యాపారం చేస్తూ తీసుకున్న రుణంకు చిత్రా కచ్చితంగా వడ్డీ చెల్లిస్తుండటంతో ఆమెకు చాలా మంది అప్పు ఇవ్వడానికి ముందుకు వచ్చేవారని సమాచారం.

 రూ. 5 లక్షలు తీసుకున్న లేడీ

రూ. 5 లక్షలు తీసుకున్న లేడీ

చెన్నైలోనే నివాసం ఉంటున్న రంగనాయకి అనే మహిళ, చిత్రా స్నేహితులు. మూడు సంవత్సరాల క్రితం చిత్రా తనకు డబ్బులు అవసరంగా ఉందని రంగనాయకికి చెప్పింది. 2020లో కరోనా వైరస్ వ్యాపించక ముందు చిత్రా ఆమె స్నేహితురాలు రంగనాయకి దగ్గర రూ. 5 లక్షలు అప్పు తీసుకుంది.

 రూ. 30 లక్షలు వడ్డీ ఇవ్వాలని డిమాండ్

రూ. 30 లక్షలు వడ్డీ ఇవ్వాలని డిమాండ్

వ్యాపారంలో నష్టం రావడంతో రంగనాయకి దగ్గర తీసుకున్న అప్పుకు చిత్రా వడ్డీ చెల్లించలేకపోయింది. ఇదే సమయంలో అప్పు ఇచ్చిన రంగనాయకితో పాటు ఆమె కుటుంబ సభ్యులు చిత్రాకు టార్చర్ పెట్టారు. రూ. 5 లక్షలకు రూ. 30 లక్షలు వడ్డీ అయ్యింది, మొత్తం డబ్బులు చెల్లించాలని, లేదంటే పులియంతోప్పులోని నీ ఇంటిని మా పేరుతో రాసివాల్వాలని రంగనాయకి, ఆమె కుటుంబ సభ్యులు కలిసి చిత్రాను వేధింపులకు గురి చేశారని ఆరోపణలు ఉన్నాయి.

 టార్చర్ తట్టుకోలేక నిప్పంటించుకుని ఆత్మహత్య

టార్చర్ తట్టుకోలేక నిప్పంటించుకుని ఆత్మహత్య

చిత్రాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తన ఇల్లు పోతే ఇద్దరు కుమార్తెలు రోడ్డునపడుతారని చిత్రా భయపడింది. ఇద్దరు కుమార్తెల జీవితం బాగుండాలని అనుకున్న చిత్రా ఆమె స్నేహితురాలు రంగనాయకికి డబ్బులు తిరిగి ఇవ్వలేక నానా ఇబ్బందులు ఎదుర్కొంది. ఇదే సమయంలో చిత్రా ఈనెల 7వ తేదీన ఇంట్లో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటలు వ్యాపించడంతో తీవ్రగాయాలైన చిత్రాను ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిత్రా చికిత్స విఫలమై చనిపోయిందని పోలీసులు తెలిపారు. అప్పులు ఇచ్చిన వాళ్లు టార్చర్ చెయ్యడంతో చిత్రా ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

English summary
Lady: Death of a woman who caught fire due to high interest loan in Chennai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X