ఛీ ఛీ.. మరీ ఇలానా !! స్టాండప్ కామెడీ షోలో మహిళా డాక్టర్ అసభ్య వ్యాఖ్యలు,,!

ముంబైలో ఇటీవల జరిగిన ఒక వింత ఘటన సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శవపరీక్షల కోసం మార్చురీకి వచ్చే మృతదేహాలను చూసినప్పుడు మీకు ఎలాంటి భావనలు కలుగుతాయి అనే ప్రశ్నకు, ఒక మహిళా వైద్యురాలు ఇచ్చిన సమాధానం తీవ్ర కలకలం సృష్టించింది. ఒక బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న డాక్టర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ప్రముఖ కమెడియన్ ప్రణీత్ మోరే ముంబైలో నిర్వహించిన ఒక స్టాండప్ కామెడీ షోలో ఈ సంఘటన జరిగింది. షో జరుగుతుండగా ప్రేక్షకుల వరుసలో కూర్చున్న సదరు మహిళా డాక్టర్‌తో ఆయన ముచ్చటించారు. మార్చురీ వాతావరణాన్ని మీరు ఎలా తట్టుకుంటారు అని అతడు అడుగగా, తాము శవాల దుస్తులు తొలగించిన తర్వాత మొదట పురుషుల అంతరంగ అవయవాల సైజును చూస్తామని, అవి పెద్దగా ఉన్నాయా లేదా చిన్నగా ఉన్నాయా అని పరిశీలిస్తామంటూ ఆమె నవ్వుతూ సమాధానం ఇచ్చారు.

lady-doctor-from-mumbai-faces-backlash-after-inappropriate-comments-about-corpses-at-comedy-show

మహిళా డాక్టర్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నిరసనలు

ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో తీవ్ర వివాదం రేగింది. చనిపోయిన వ్యక్తుల గౌరవానికి భంగం కలిగించే విధంగా ప్రవర్తించడం చాలా హేయమైన చర్య అని నెటిజన్లు మండిపడుతున్నారు. ఒకవేళ ఏ మగ డాక్టర్ అయినా ఆడవారి శవాల గురించి ఇలా మాట్లాడి ఉంటే, ఈపాటికి ఉద్యోగం పోయి జైల్లో ఉండేవాడని ఆరోపించారు. సదరు డాక్టర్ లైసెన్స్‌ రద్దు చేయాలని జాతీయ వైద్య కమిషన్ (NMC), మహారాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌ను కోరుతున్నారు.

మరణించిన వ్యక్తులకు కూడా సొంత కుటుంబాలు ఉంటాయని, వారు సమాజంలో గౌరవప్రదమైన స్థానాల్లో ఉండి ఉండవచ్చని ప్రజలు గుర్తు చేస్తున్నారు. వైద్యుల నోటి నుంచి అసభ్యకర వ్యాఖ్యలు రావడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు తలెత్తాయి. దాంతో ఆ వైద్యురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు నెట్‌లో హోరెత్తాయి. ఈ వివాదం రోజురోజుకూ ఊపందుకోవడంతో సదరు వైద్యురాలు చివరికి స్పందించక తప్పలేదు.

ఈ వ్యవహారం వివాదాస్పదం కావడంతో ఆ మహిళా డాక్టర్ బహిరంగంగా క్షమాపణలు కోరారు. షోలో ఉన్న హాస్యభరిత వాతావరణం కారణంగానే ఎటువంటి దురుద్దేశం లేకుండా అలా మాట్లాడానని ఆమె స్పష్టం చేశారు. తాను అసలు మెడికల్ మార్చురీ విభాగంలో పని చేయడం లేదని, బయోకెమిస్ట్రీ డాక్టర్‌గా ఉన్నానని చెప్పుకొచ్చారు. కేవలం జోక్ కోసం అలా అబద్ధం చెప్పానని, వైద్య రంగానికి కలిగిన నష్టానికి విచారం వ్యక్తం చేస్తూ ఇకపై హుందాగా నడుచుకుంటానని హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+