Lady doctor: ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం, ప్రైవేట్ ఆసుపత్రిలో పాడుపడి, శాడిస్టు డాక్టర్, ఖర్మ !
చెన్నై/కడలూరు: ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న డాక్టర్ ఇంటి సమీపంలో క్లీనిక్ నిర్వహిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేసుకోవడానికి వెలుతున్న మహిళలకు లేనిపోని మాటలు చెప్పి ఆమె క్లీనిక్ దగ్గరకు పిలిపించుకుని వైద్యం చేసి లక్షలు లక్షలు డబ్బులు సంపాధిస్తోంది. నిండు గర్బవతి అయిన మహిళ చికిత్స చేసుకోవడానికి ఆసుపత్రికి వెళ్లింది. ఆ సమయంలో నీ కడుపులో బిడ్డ చనిపోయిందని చెప్పింది. తరువాత క్లీనిక్ దగ్గరకు పిలిపించుకుని ఆపరేషన్ చేసి కడుపులో బిడ్డను బయటకు తీసింది. ఆ మహిళ కుటుంబ సభ్యుల దగ్గర డబ్బులు తీసుకున్న లేడీ డాక్టర్ సైలెంట్ గా ఉండిపోయింది. విషయం బయటకు రావడంతో వివాదం మొదలై కలెక్టర్ ఎంట్రీ ఇచ్చారు. డాక్టర్ ను బదిలి చెయ్యడంతో ఆమె ఎక్కడైతే విధుల్లో చేరిందో అక్కడ ఇలాంటి డాక్టర్ మాకు అక్కర్లేదు అంటూ స్థానికులు గొడవకు దిగారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్
తమిళనాడులోని ఉడుమలైపేటైలో జ్యోతిమణి అలియాస్ జ్యోతి అనే మహిళ గైనకాలజిస్టుగా ఉద్యోగం చేస్తున్నది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న డాక్టర్ జ్యోతిమణికి ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోవడం లేదు. ఉడుమలైపేటై ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న డాక్టర్ జ్యోతిమణి ఇంటి సమీపంలో క్లీనిక్ నిర్వహిస్తోంది.

పీడించి డబ్బులు తీసుకుంటున్న లేడీ డాక్టర్
ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేసుకోవడానికి వెలుతున్న మహిళలకు లేనిపోని మాటలు చెబుతున్న డాక్టర్ జ్యోతిమణి ఆమె క్లీనిక్ దగ్గరకు పిలిపించుకుని వైద్యం చేసి లక్షలు లక్షలు డబ్బులు సంపాధిస్తోంది. ఇలా చాలా కాలం నుంచి డాక్టర్ జ్యోతిమణి తీరుతో స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వ పెద్దలు మాత్రం పట్టించుకోలేదని తెలిసింది.

కడుపులో బిడ్డ చనిపోయాడని
ఉడుమలైపేటై సమీపంలోని మడత్తుకుళం జిల్లాలో కరతోలుపు ప్రాంతంలో మారిముత్తు, రాజేశ్వరి దంపతులు నివాసం ఉంటున్నారు. సెప్టెంబర్ 23వ తేదీన నిండు గర్బణిని అయిన రాజేశ్వరికి కాన్ఫూ చేయించాలని ప్రభుత్వ ఆసుపత్రికి పిలుచుకుని వెళ్లారు. రాజేశ్వరిని పరిశీలించిన డాక్టర్ జ్యోతిమణి నీ కడుపులో బిడ్డ చనిపోయిందని, ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తియ్యాలని, నాలుగు రోజులు ఆసుపత్రిలోనే ఉండాలని, లేదంటే నీ ప్రాణాలకే ప్రమాదం అని చెప్పింది.

పీడించి డబ్బులు లాక్కొన్న లేడీ డాక్టర్
బిడ్డ బయటకు రాకపోవడంతో డాక్టర్ జ్యోతిమణి ఆమె ప్రైవేట్ క్లీన్ లోకి రాజేశ్వరిని పిలుచుకుని వెళ్లి ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీసింది. ప్రైవేట్ క్లీనిక్ లో చికిత్స చేసినందుకు పేదవాళ్లు అయిన రాజేశ్వరి కుటుంబ సభ్యుల దగ్గర డాక్టర్ జ్యోతిమణి రూ. 37 వేలు తీసుకుంది. బిడ్డ చనిపోవడం, ప్రభుత్వ డాక్టర్ జ్యోతిమణి టార్చర్ పెట్టి రూ. 37 వేలు లాక్కోవడంతో రాజేశ్వరి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

శాడిస్టు డాక్టర్ మాకు అక్కర్లేదు
విషయం తెలుసుకున్న అధికారులు జ్యోతిమణిని కడలూరు ప్రభుత్వ ఆసపత్రికి బదిలి చేసి రాజేశ్వరి దగ్గర తీసుకున్న రూ. 37 వేలు తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. డాక్టర్ జ్యోతిమణిని కడలూరుకు బదిలి చెయ్యడంతో ఆమె ఎక్కడైతే విధుల్లో చేరిందో అక్కడ ఇలాంటి శాడిస్టు డాక్టర్ జ్యోతిమణి మాకు అక్కర్లేదు అంటూ స్థానికులు గొడవకు దిగారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications