కింగ్ మేకర్‌గా లాలూ: రాజకీయ ప్రస్థానమిదీ?
పాట్నా: బీహార్ రాజకీయాల్లో ఆయనది ప్రత్యేక శైలి. ఆయనే లాలూ ప్రసాద్ యాదవ్. బీహార్‌లో ఒకప్పుడు కింగ్‌గా ఉన్న ఆయన మధ్యలో కొన్నాళ్లు రాజకీయంగా దుర్భర స్థితి చూశారు. తాజా ఎన్నికల్లో మాహాకూటమి విజయంలో కీలక పాత్ర పోషించడంతో పాటు 80 సీట్లను గెలుచుకొని కింగ్ మేకర్‌గా అవతరించారు.
సరదా వ్యాఖ్యలు చేయడంలో లాలూది అందవేసిన చేయి. జబ్ తక్ రహేగా సమోసామే ఆలూ.. తబ్ తక్ రహేగా బిహార్ మే లాలూ! ఈ ఒక్క డైలాగ్ చాలు, బీహార్‌లో లాలూ సత్తా ఏంటో తెలుసుకోవడానికి. అంతేకాదు బీహార్ అంటేనే లాలూ అన్నంతగా ఈ ఎన్నికల్లో ప్రచారం చేశాడు.

గతంలో కూడా బిహార్ రోడ్లను హేమమాలిని బుగ్గల్లా నున్నగా చేస్తా! భారతీయ రైల్వే, ప్రయాణికుల భద్రత.. విశ్వకర్మ బాధ్యత.. నా బాధ్యత కాదు!! ఆవును నియంత్రించాలంటే దాని తోక పట్టుకోకూడదు.. కొమ్ములు పట్టుకోవాలని మా అమ్మ చెప్పింది. రైల్వే బాధ్యతల్లో నేను దాన్నే అనుసరించా!! లాంటి వ్యాఖ్యలు చేశారు.
దేశ రాజకీయాల్లో లాలూ జీవితం ఆద్యంతం ఆసక్తికరం. 2005 నుంచి అధికారానికి దూరం. గతేడాది జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా దక్కని స్థితి. దీనికి తోడు దాణా కుంభకోణం కేసులో 2013లో లోక్‌సభ సభ్యుడిగా అనర్హత వేటుపడింది. అలాగే ఆరేళ్లు ఎన్నికల్లో పోటీ చేయకూడదని సుప్రీం కోర్టు నిషేధం విధించింది.
2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 40 సీట్లకు గాను కేవలం 4 సీట్లను మాత్రమే గెలుచుకుంది. దీంతో బీహార్‌లో లాలూ శకం ముగిసిందనున్నారంతా? కానీ బీహార్ ఎన్నికల్లో మాహాకూటమి విజయంలో కీలకపాత్ర పోషించడంతో పాటు 80 సీట్లను సొంతం చేసుకున్నాడు.
తన అహాన్ని విడిచి నితీశ్ కుమార్‌కు స్నేహ హస్తం అందించడం ద్వారా బీహార్‌లో లాలూకు రాజకీయ పునరుజ్జీవం సాధ్యమైంది. దాదాపు 45 ఏళ్ల సుదీర్ఘ అనుభవంగల లాలూ దేశ రాజకీయల్లో తనదైన ముద్రను వేశారు. పిన్న వయసులోనే 1970లో పాట్నా విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శిగా రాజకీయ అరంగేట్రం చేసిన లాలూ ఆ తర్వాత అధ్యక్షుడయ్యాడు.
విద్యార్థి సంఘాలపై నాటి ప్రధాని ఇందిర ప్రభుత్వ వైఖరితో 1974లో రేగిన హింసాత్మక పరిస్థితుల్లో విద్యార్థి సంఘ నేతగా కీలకపాత్ర పోషించడం లాలూకు తొలిసారి గుర్తింపు తెచ్చింది. అప్పట్లో లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ స్ఫూర్తిగా ‘ఛాత్ర యువ సంఘర్ష్ సమితి' వ్యవస్థాపక నేతగా ఆందోళనల్లో పాల్గొని కొన్నాళ్లు గృహనిర్బంధంలో గడిపారు.
ఆ తర్వాత దేశంలో ఎమర్జెన్సీ ప్రభావంతో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్ప డినప్పుడు 29 ఏళ్లకే తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1979 ఎన్నికల్లో ఓడినా, 1980, 1985లో బిహార్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తిరిగి 1989లో లోక్‌సభ సభ్యుడయ్యారు.
బిహార్‌లో జనతాదళ్ అధికారంలోకి (1990) వచ్చాక అప్పటి ప్రధాని వీపీ సింగ్, సీఎం పదవి ఎవరి కివ్వాలన్న మీమాంసలో పడినప్పుడు ఉప ప్రధాని దేవీలాల్ లాలూ పేరును సూచించారు. అలా 1990లో తొలిసారిగా బిహార్ పగ్గాలు చేపట్టిన లాలూ 1997దాకా కొనసాగారు. తర్వాత దాణా కుంభకోణంలో ఆరోపణలతో జనతా పార్టీ నుంచి బయటకు వచ్చి, రాష్టీయ జనతాదళ్ (ఆర్జేడీ)ను స్థాపించారు.
-
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం!












Click it and Unblock the Notifications